శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ మృతి

ప్రముఖ శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ (55) ఇక లేరు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. గత డిసెంబర్‌ 23న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించగా ఆసుపత్రికి తరలించారు.  గత కొద్దిరరోజులుగా ఐసీయూలో వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందించారు.
ఇంతకు ముందు ఆయన ముంబయిలోని టాటా మెమోరియల్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోల్‌కతాకు వచ్చారు.  ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జన్మించారు.  తాత ఉస్తాద్‌ నిసార్‌ హుస్సేన్‌ ఖాన్‌ వద్ద శిక్షణ తీసుకున్నారు. తొలిసారిగా ఆయన 11 సంవత్సరాల వయసులో రంగస్థల ప్రదర్శన న్విహించారు.
ఆ తర్వాత సినిమాల్లోనూ ఆయన పాటలు పాడారు. ‘జబ్‌ వి మెట్‌’లో ఆయన ‘ఆవోగే జబ్ తుమ్ సాజ్నా’ అనే పాట బాగా పాపులర్‌ య్యింది.  ఆయన ఉస్తాద్‌ అమీర్‌ ఖాన్‌, పండిట్‌ భీంసేన్‌ జోషి సంగీతానికి ప్రభావితుడయ్యారు. సినిమాల్లో ఆయన పాడిన పాటల్లో ‘తెరే బినా మోహే చైన్’ సూపర్‌హిట్ పాటను ఆలపించారు. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ హిట్‌ ఆఫ్ ది ఇండస్ట్రీ ‘మై నేమ్ ఈజ్ ఖాన్‌’ చిత్రంలోనూ ‘అల్లా హాయ్ రెహెమ్’ పాటపడారు. 
 
అలాగే ‘రాజ్‌-3’, ‘కాదంబరి’, షాదీ మే జరూర్ ఆనా’, ‘మంటో’ తదితర చిత్రాల్లోనూ గాత్రంతో అలరించారు. అలాగే బెంగాలీ పాటలను సైతం స్వరపరిచారు. దశాబ్దాల పాటు తనగాత్రంతో సంగీత ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసిన ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషన్‌ అదుకున్నారు. రషీద్‌ ఖాన్‌ మృతికి పలువురు సంగీత అభిమానులు, సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

ప్రఖ్యాత హిందీ కవి హరిరామ్ ద్వివేది కన్నుమూత

కాగా, ప్రఖ్యాత హిందీ, భోజ్‌పురి కవి, గీతరచయిత, సాహితీవేత్త, పండిట్ హరిరామ్ ద్వివేదీ కూడా మహమూర్‌గంజ్ ఏరియాలో తన స్వగృహంలో కన్నుమూశారు. హరిభయ్యాగా అందరికీ పరిచయమైన ఆయన వయసు 87 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం ఆదివారం క్షీణించిందని, సోమవారం తుది శ్వాస విడిచారని చెప్పారు.

ద్వివేదీ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలియజేశారు. కాశీ నివాసి అయిన ద్వివేదీ హిందీ సాహిత్యంలో విశేష కృషి చేశారని, అంగనైయా, జీవనదాయని గంగ, తదితర పద్యరచనలు సాగించారని, ఆయన నిత్యం మన జీవితాల్లో జీవిస్తుంటారని నివాళులు అర్పించారు. భగవంతుని పాదాల చెంత సరైన స్థలం ఆయనకు లభించాలని కోరుకుంటున్నట్టు ప్రధాని తన సంతాపంలో నివాళులు అర్పించారు.