సైనికపరంగా కొత్త విమానాశ్రయం నిర్మాణంతో అరేబియా సముద్రం, హిందు మహాసముద్రం పర్యవేక్షణలో భారత్‌కు వ్యూహాత్మకంగా సహాయపడుతుంది. మినీకాయ్ ద్వీపంలో ఎయిర్‌స్ట్రిప్ నిర్మించాలని ఇండియన్ కోస్ట్ గార్డ్ గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
తాజాగా ప్రతిపాదనలో భారత వైమానిక దళం కార్యకలాపాలకు అవకాశం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచం దృష్టి మొత్తం లక్షద్వీప్‌పైనే ఉన్నది. మినీకాయ్‌లో విమానాశ్రయం నిర్మాణం చేపడితే లక్షద్వీప్‌లో పర్యాటకం సైతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రస్తుతం లక్షద్వీప్‌లోని అగట్టి ద్వీపంలో ఎయిర్‌స్ట్రిప్ ఉంది. కానీ అన్ని రకాల విమానాలు ఇక్కడ దిగలేవు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటిప్పటి నుంచి లక్షద్వీప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. సోషల్ మీడియాలో మోదీ షేర్ చేసిన చిత్రాలను చూసిన నెటిజన్స్ లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. ఈ క్రమంలో మాల్దీవుల మంత్రులు భారత్‌తో పాటు ప్రధానిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం తర్వాత ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన మంత్రులను మాల్దీవులు ప్రభుత్వం వేటు వేసింది.
భారత్ మాకు సన్నిహిత దేశం
ప్రధాని మోదీకి శరద్ పవార్ సంఘీభావం
మాల్దీవుల వివాదం నేపధ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలిచారు. ఇతర దేశం ప్రధానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మోదీ దేశ ప్రధాని అని, ఏ ఇతర దేశం నుంచి ఎలాంటి హోదాలో ఉన్న వ్యకైనా మన ప్రధానిపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే తాము అంగీకరించబోమని ఆయన హెచ్చరించారు. ప్రధాని పదవిని మనం గౌరవించాలని తేల్చి చెప్పారు.

More Stories
రూ.33,600 కోట్లతో పారిశ్రామిక ప్రగతికి ‘భవ్య’ పథకం
పశ్చిమాసియాలో గ్యాస్ క్షేత్రాలపై క్షిపణుల వర్షం
ముస్లింలకు, ఇస్లామిస్టులకు మధ్య తేడాను స్పష్టంగా గుర్తించాలి