
ఇతడి పేరు మహ్మద్ హబీబ్. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ కు చెందిన 70 ఏళ్ల ఈ హబీబ్.. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానాన్ని అందుకున్నారు. రామమందిర చిత్రం, అక్షంతలు, ఓ లేఖను అందుకున్న హబీబ్.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చాలా మైళ్ల దూరంలో ఉన్న తనకు ఈ ఆహ్వానం అందడం.. అత్యంత అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రకటించారు. అసలు ఓ ముస్లింకు అయోధ్య ఆహ్వానం ఎందుకు అందజేశారు..? ఆయన ప్రత్యేకతేంటి..?
మహ్మద్ హబీబ్.. ఇతను ముస్లిం అయినా.. కరసేవకుడు. సామాజిక కార్యకర్త. 1992 లో అయోధ్యలో జరిగిన కరసేవకుల ఆందోళనల సమయంలో.. ఈయన కూడా చురుగ్గా పాల్గొన్నారు. తన సహచరులతో కలిసి.. ఆనాటి ఆ ఘటనలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అంతేకాదు.. ఆ తర్వాత బీజేపీ అనుబంధ ఆందోళనల్లో పాల్గొన్నారు. పార్టీ సంబంధిత వివిధ పదవులను సైతం అలంకరించారు. అప్పటి నుంచి పార్టీ కార్యకర్తగా కొనసాగుతోన్నా.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఆయనకు మాత్రం అయోధ్యలో రామమందిరం చూడాలనే కోరిక ఉండేది. ఇన్నాళ్లకు అది నేరవేరింది అని చెబుతున్నారు.
రాముడిని తమ పూర్వీకుడిగా భావిస్తామని.. సగర్వంగా చెబుతున్నారు.. మహ్మద్ హబీబ్. పూర్వీకులను స్మరించుకోవడంలోనే భారతీయత దాగుందని అంటారు. బీజేపీకి తాను పాత వ్యక్తిని అని.. 32 ఏళ్ల తర్వాత ఆ పాత జ్ఞాపకాలు మళ్లీ కళ్లముందు కదలాడుతున్నాయని.. అయోధ్య ఆహ్వానాన్ని అందుకున్న క్షణాన తన మదిలోని భావాలను హబీబ్ పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రాణప్రతిష్ట వేడుకలను టీవీలో చూస్తానని.. జనవరి 22 తర్వాత ఎప్పుడైనా అయోధ్యకు వెళ్లి శ్రీరాముడిని దర్శించుకుంటానని హబీబ్ తెలిపారు. ఆ రోజు భారతీయులందరికీ ప్రత్యేకమైన చారిత్రాత్మకమైన రోజు అని అవుతుంది అని అన్నారు.
అయోధ్య ఆహ్వానాన్ని అందుకున్న ముస్లింలలో ఒక్క హబీబ్ మాత్రమే లేరు. వారణాసిలో, ముస్లిం మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న.. ముస్లిం మహిళా ఫౌండేషన్ చీఫ్, సామాజిక కార్యకర్త నజ్నీన్ అన్సారీ, ఆమె సహచరురాలు నజ్మా కూడా అయోధ్యలో ప్రాణప్రతిష్ట వేడుకలకు హాజరవ్వాలంటూ అక్షతలు అందుకున్నారు. రాముడు తమ పూర్వీకుడు అని అంటున్నారు. రాముడు తమ ప్రతీ కణంలోనూ ఉంటాడని.. మనం మన మతాలను మార్చగలం కానీ.. మన పూర్వీకులను మర్చలేమని చెబుతున్నారు. అయోధ్యలో శ్రీరాముడు ప్రతిష్ఠించబడతాడు.. ఇంతకంటే సంతోషం ఏముంటుందిని ప్రశ్నిస్తున్నారు. వీరితో పాటు.. రామమందిరం-బాబ్రీ మసీదు వివాదం కేసులో ముస్లిం పక్షాన ప్రాతినిధ్యం వహించిన అయోధ్యకు చెందిన ఇక్బాల్ అన్సారీ దీక్షా కార్యక్రమంలో పాల్గొనాంటూ ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా అయోధ్య ఎప్పుడూ గంగా జమున తహజీబ్ అని.. ఎప్పుడూ సామరస్యంగా ఉంటుందని.. అన్సారీ చెప్పారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్