దివ్యజనని శ్రీ శారదాదేవి 171వ జయంతి వేడుకలు హైదరాబాద్ దోమల్‌గూడలోని శ్రీరామకృష్ణ మఠంలో కన్నుల పండువగా జరిగాయి. ఉదయం ఐదున్నరకు సుప్రభాతం, మంగళారతి, భజనలతో జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఆరున్నరకు దేవాలయ ప్రదక్షిణం, ఉదయం ఏడు గంటలకు లలితా సహస్రనామ పారాయనం, పదిన్నరకు హోమం నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద శారదాదేవి జీవితం, సందేశంపై ప్రసంగించారు.
మధ్యాహ్నం రెండు గంటలకు దివ్యజనని శ్రీ శారదాదేవి చలనచిత్రాన్ని ప్రదర్శించారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేకంగా రూపొందించిన శారదా మాత బెంగళూరు రాక్ నమూనా దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం స్వాములు, భక్తులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

More Stories
తెలంగాణాలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు, 13న ఓట్ల లెక్కింపు
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం బిజెపి ధర్నా
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అంతా రహస్యమే!