
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఒక హిందూ మహిళ పోటీలోకి దిగనుంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునేర్ జిల్లా నుంచి డాక్టర్ సవీరా పర్కాశ్ పీకే 25 స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవలే పాకిస్తాన్ ఎన్నికల సంఘం కొన్ని కీలక సవరణలు చేసింది. జనరల్ స్థానాల్లో తప్పనిసరిగా ఐదు శాతం మహిళా అభ్యర్థులు ఉండాలని పేర్కొంది. ఈ క్రమంలోనే బునేర్ జిల్లాలోని జనరల్ స్థానం నుంచి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) టికెట్ పై పోటీ చేస్తున్నారు. కాగా ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి సవీరా పర్కాశ్ 2022లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె తండ్రి ఓం పర్కాశ్ రిటైర్డ్ డాక్టర్. గత 35 ఏళ్లుగా ఓం పర్కాశ్ బిలావల్ భుట్టో ఆధ్వర్యంలోని పీపీపీలో కీలక సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం సవీరా పీపీపీ మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 28,600 మంది పోటీ చేస్తుండగా ఇందులో దాదాపు మూడు వేల మంది మహిళలున్నారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక