రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగానే రాష్ట్రంలో తొలి మరణం సంభవించింది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు పెరుగుతోంది. కేసులు కూడా ప్రతీ రోజు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న వ్యక్తి మరణించారు. అనేక ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి కరోనా టెస్ట్‌లు చేయగా పాజిటివ్ అని నిర్దారణైంది. చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కూడా ఒక మహిళా రోగి కరోనాతో మృతి చెందింది. గంటల వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాల్లో రెండు మరణాలు నమోదవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

More Stories
ప్రజలపై కాంగ్రెస్ అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్‌కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!