
2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నూతన బడ్జెట్లో ఎలాంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారింపబోతోందనే ఆసక్తి మెుదలైంది.
అయితే, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2024-25 మధ్యంతర బడ్జెట్లో ప్రజలు ఎలాంటి అద్భుతమైన ప్రకటనలను ఆశించొద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
2024-25కి సంబంధించిన బడ్జెట్ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఆమె తెలిపారు. అయితే ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదు. ఈసారి ఫిబ్రవరి 1 బడ్జెట్ కేవలం ఓటు ఆన్ అకౌంట్ మాత్రమేనని ఆమె వెల్లడించారు.
ఇది కేవలం తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ఖర్చులను భరించే బడ్జెట్ మాత్రమేనని ఆమె తెలిపారు. రెగ్యులర్ బడ్జెట్ జూలైలో ఉంటుందని, అప్పటి వరకు ప్రజలు వేచి ఉండాల్సిందేనని ఆమె ఆమె చెప్పారు. అయితే రాబోయే ఫిబ్రవరిలో నిర్మలమ్మ ప్రవేశపెట్టే బడ్జెట్ ఆరవది కావటం విశేషం.
మధ్యంతర బడ్జెట్ 2024- 25లో సులభంగా వ్యాపారం చేయడం, దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రైవేట్ పెట్టుబడులను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించవచ్చని తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్లో ప్రధానంగా ప్రభుత్వ వ్యయం, రాబడి, ఆర్థిక లోటు, ఆర్థిక పనితీరు మరియు రాబోయే నెలల్లో అంచనాలు ఉన్నాయి.
ఇందులో పెద్ద విధాన మార్పులు లేదా కొత్త దీర్ఘకాలిక ప్రాజెక్ట్లు ఉండవు. అవి పూర్తి బడ్జెట్లో మాత్రమే ఉంటాయని స్పష్టం అవుతుంది.
గత ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్ను చెల్లింపుదారుల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా నూతన టాక్స్ విధానంలో వార్షిక పన్ను రహిత ఆదాయ పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. దీనికి తోడు మోదీ సర్కార్ మహిళలతో పాటు ఇతరులకు ప్రయోజనకరమైన అనేక పథకాలను ప్రకటించారు.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు