బంగ్లాదేశ్‌లో హిందూ మతంలోకి 220 క్రైస్తవ కుటుంబాలు

హిందువులు మైనార్టీలుగా ఉన్నవేళ.. చారిత్రక ఆలయాలు ధ్వంసమవుతున్న సమయాన.. తీవ్రమైన దాడులను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ లో.. ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ లో వందలాది క్రైస్తవ కుటుంబాలు.. తిరిగి స్వమతాన్ని స్వీకరించారు. బంగ్లాదేశ్ అగ్నివీర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 220 క్రైస్తవ కుటుంబాలు.. సంప్రదాయబద్దంగా.. యజ్ఞోపవీతాన్ని ధరించారు.
వందలాదిగా ఒక్కచోట చేరిన క్రైస్తవుల సమక్షంలో.. యజ్ఞాన్ని నిర్వహించారు. యజ్ఞోపవీతం.. పరమం పవిత్రం అంటూ మంత్రాలు చదువుతున్న వేళ.. వందలాదిగా పురుషులు యజ్ఞోపవీతాన్ని ధరించి.. హిందూమతంలోకి మారారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చాలామందికి ధైర్యం చెప్పాల్సి వచ్చిందని.. నిర్వాహకులు తెలిపారు. ఇటు తిరిగి స్వంత మతంలోకి మారడం సంతోషంగా ఉందని.. మతం మారిన వారు చెబుతున్నారు.
నిరుపేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వేలాది కుటుంబాలను క్రైస్తవంలోకి మార్చారు. అయితే బంగ్లాదేశ్ అగ్నివీర్ చర్య ద్వారా.. దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుందని.. చెబుతున్నారు. మతమార్పిడులు మరియు హిందూ కమ్యూనిటీలపై దాడుల గురించి ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో, బంగ్లాదేశ్ అగ్నివీర్ యొక్క ఈ చర్య జనాభాలోని బలహీన వర్గాలకు రక్షణ కల్పించడం మరియు సాధికారత కల్పించడం జరుగతుందని చెబుతున్నారు.