మణిపూర్‍లో మళ్లీ హింసాకాండలో 13 మంది మృతి

మణిపూర్‍లో మళ్లీ హింసాకాండలో 13 మంది మృతి
మణిపూర్ లో మరోసారి హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం లీతు గ్రామంలో జరిగినట్లు వారు తెలిపారు. “మయన్మార్‌కు వెళుతున్న మిలిటెంట్ల గుంపుపై ఆ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించిన మరో వర్గం తిరుగుబాటుదారులు మెరుపుదాడి చేశారు” అని హిల్ జిల్లాలోని ఒక అధికారి తెలిపారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు ఇప్పటివరకు 13 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతి చెందిన వారు స్థానికులు కాదని ఓ అధికారి చెప్పారు. తెంగ్నౌపాల్ జిల్లా మయన్మార్‌తో పోరస్ సరిహద్దును పంచుకుంటుంది.  జాతుల మధ్య వైరం కారణంగా గత ఏడు నెలలుగా మణిపుర్‌ లో హింస కొనసాగింది.
 
ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారు లీతూ గ్రామానికి చెందిన వారు కాదని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఈ గ్రూప్‌ గ్రామంలోని మరో తెగకు చెందిన గ్రూప్‌తో ఘర్షణకు దిగిందని భద్రతాధికారులు చెప్తున్నారు. స్థానికులు కాకపోవడంతో మరణించిన 13 మంది ఎవరనేది ఇంకా గుర్తించలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
 
కొద్దిరోజుల క్రితం శాంతి పునరుద్ధరణలో భాగంగా ఓ తిరుగుబాటు వర్గంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నా హింస తలెత్తింది.
మణిపూర్ ప్రభుత్వం, ఏడు నెలల తర్వాత ఆదివారం హింసాత్మక రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఎత్తివేసింది. 
 
ఆ తర్వాత రోజు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగడం గమనార్హం. తొమ్మిది జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గత వారం ఇంఫాల్‌ లోయలోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ తో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన శాంతి చర్చలు ఫలప్రదం కావడంతో ఢిల్లీలో శాంతి ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.