
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ పరాజయం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దాదాపు కన్ఫర్మ్ అయిపోయాయి. మ్యాజిక్ ఫిగర్ 60కు ఎగువన కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతుండగా.. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తప్ప ఎక్కడా కారు పార్టీ జోరు కనిపించటం లేదు. 2018 ఎన్నికల్లో సాధించిన 88 సీట్లలో సగం కూడా సాధించలేక బీఆర్ఎస్ పార్టీ చతికల పడిపోయింది. ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు ఎన్నికల ఫలితాల సరళి ద్వారా స్పష్టంగా అర్ధం అవుతోంది. గజ్వేల్‌లో బొటాబొటీ మెజార్టీతో కేసీఆర్ గట్టేక్కే పరిస్థితి కనిపిస్తుండగా.. కామారెడ్డిలో మాత్రం ఆయన ఘోర పరాజయం మూటగట్టుకునేలా ఉన్నారు. మరోవైపు పార్టీ తరపున పోటీ చేసిన అనేక మంది మంత్రులు సైతం ఎదురీదుతున్నారు. దీంతో.. గత 10 సంవత్సరాలుగా ఆ పార్టీపై ప్రజల్లో పెరుగుతూ వస్తున్న అసంతృప్తికి ఎన్నికల ఫలితాలు అద్దం పడుతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ స్వయంకృతాపరాధాలు, నిరంకుశ, అవినీతి విధానాలే ఈ ఎన్నికల్లో కారు పార్టీని షెడ్డుకు పంపాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
More Stories
కొండా సురేఖకు తెలియకుండానే ఆమె ఓఎస్డీ తొలగింపు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి
ముగ్గురు కాళేశ్వరం ఇంజినీర్ల రూ. 400 కోట్ల ఆస్తులు సీజ్!