తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. దాదాపు 70 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ విజయం దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ వెళ్లారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరి ఆయనకు అభినంనలు తెలిపారు డీజీపీ అంజని కుమార్. అంజనీ కుమార్ వెంట పలువురు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనకు కల్పించే భద్రతపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 37 సీట్లలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

More Stories
అట్టహాసంగా ప్రారంభమైన మేడారం జాతర
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు `సుప్రీం’ కోర్టుధిక్కార నోటీసులు
మున్సిపల్ ఎన్నికల్లో సగం సీట్లు మహిళలకే