
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయాలకు సైతం.. ముస్లిం జీహాదీ గ్రూపుల నుంచి బెదిరింపులు తప్పటం లేదు. తాజగా తెలంగాణలోని కొత్తగూడెంలోని బాబు క్యాంప్ ఏరియాలో కొలువు తీరిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి “జీహాద్-కొత్తగూడెం” పేరిట వచ్చిన ఓ బెదిరింపు లేఖ కలకలం సృష్టిస్తోంది. ముస్లిం జీహాదీ గ్రూపులను సూచించే ఫోటోలతో కూడిన ఆలేఖలో తీవ్రమైన పదజాలంతో వెంకటేశ్వర స్వామి వారిని ధూషించారు.
అంతే కాకుండా వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి సందేశాలను, భక్తి పాటలను వినిపించే మైకులను ఆఫ్ చేయకపోతే గుడిని పేల్చేస్తామంటూ బెదిరించారు. అదే విధంగా ఆలయ అర్చకులను సైతం కడతేరుస్తామంటూ “జీహాద్-కొత్తగూడెం” పేరిట వచ్చిన ఆ లేఖలో వార్నింగ్ ఇవ్వటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖ ఎవరు పంపారు..? ఎక్కడి నుంచి వచ్చింది..? దీని వెనుక దేశీయంగా ఉన్న తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉందా..? లేక విదేశీ ఉగ్రవాదుల హస్తం కూడా ఉందా..? అన్న కోణంలో దర్యాప్తు చేయాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.
దీనిపై పోలీసులు, ఎన్ఐఏ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాలని కోరుతున్నాయి. మొత్తం మీద కొత్తగూడెంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముస్లిం జీహాదీ గ్రూపుల పేరిట వచ్చిన లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
More Stories
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే
పొంగులేటి ఒంటెత్తు పోకడలపైమహిళా మంత్రుల అసహనం