
గతంలో రోజా అశ్లీల చిత్రాలలో నటించారని, ఆ వీడియోలు తన వద్ద ఉన్నాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ వ్యవహారంపై మంత్రి రోజా కోర్టులో పరువు నష్టం దావా వెయ్యటంతో తెరపైకి వచ్చింది.
మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బండారు సత్యనారాయణపై గతంలో గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఆయనపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 504, 354ఏ, 505, 506, 509, 499, ఐటీ సెక్షన్ 67 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను అరెస్టు చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
విపక్ష నేతలపై మాటల యుద్ధం చేస్తుండే మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం సంబరాలు చేసుకోవడంతో టిడిపి నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మంత్రి రోజాపై మండిపడటంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ