
సాధారణంగా దీపావళి ఏడాదిలో ఒకేసారి వస్తుంది. ఈ సారి దీపావళి పండుగ గడిచిపోయింది. అయితే తెలంగాణాలో మాత్రం ఈ సారి మూడు సార్లు దీపావళి పండుగ జరుపుకోబోతున్నట్లు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడించారు. డిసెంబర్ 3వ తేదీన బీజేపీ అధికారంలోకి రాగానే రెండోసారి దీపావళి, జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభమయ్యాక మూడోసారి దీపావళి జరుపుకోబోతున్నారని ఆయన వెల్లడించాయిరు.
సోమవారం జనగామ, కోరుట్లలో నియోజకవర్గాల్లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ ఎంఐఎం 3జీ, కాంగ్రెస్ 4జీ పార్టీలు అయితే బీజేపీ తెలంగాణ ప్రజల పార్టీని అధికారంలోకి రాగానే అవినీతి పరులందరినీ జైలుకు పంపించే బాధ్యత బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. బీజేపీని గెలిపిస్తే ఉచితంగా అయోధ్య యాత్ర చూపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
‘‘అయోధ్య రామ మందిరం జనవరిలో ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు. బీజేపీని గెలిపిస్తే ఉచితంగా అయోధ్య యాత్ర చేపిస్తాం. తెలంగాణలో బీజేపీ వస్తే అవినీతికి పాల్పడిన అందరినీ జైలుకు పంపుతాం” అని వెల్లడించారు. పార్లమెంట్ నిర్మించిన మోదీ దేశ గర్వాన్ని పెంచిన నాయకుడు అని చెబుతూ ప్రధాని మోదీ కృషితో చంద్రయాన్ ముద్దాడిన ఘనత మనదతెలిపారు.
“మిషన్ కాకతీయ అంటేనే కమీషన్. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ తీసేసి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతాం. 2024లో మరోసారి మోదీని ప్రధానిని చేద్దాం’’ అని ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు.
తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కుటుంబ పార్టీలేనని చెబుతూ తరాలు మారినా ఇవి కుటుంబ పార్టీలుగానే ఉన్నాయని ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మూడు షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభించడంతో పాటు నిజామాబాద్లో 500 పడకలతో బీడీ కార్మికుల కోసం ఆసుపత్రిని నిర్మిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
బైరాన్పల్లిలో అమరవీరుల స్మారక స్థూపం నిర్వహించడంతో పాటు సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఓవైసీకి భయపడే కేసీఆర్ విమోచన దినోత్సవాలు జరపడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని చెబుతూ తెలంగాణలో తొలిసారి బీసీ ముఖ్యమంత్రిని తమ పార్టీ చేయబోతున్నదని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లను తొలగించి వాటిని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామని కేంద్ర హోమ్ మంత్రి చెప్పారు. పసుపు బోర్డును ప్రకటించడంతో ఉత్తర తెలంగాణ రైతుల ఆకాంక్షను ప్రధాని మోదీ నెరవేర్చారని ఆయన గుర్తు చేశారు.
వరి ధాన్యాన్ని రూ.3100 మద్దతు ధరతో పూర్తిగా కొనుగోలు చేస్తామని, మహిళలకు ఏడాదికి ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు, రూ.10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజీ, వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య కాశీ యాత్రల సౌకర్యం కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణలో బీజేపీని గెలిపించాలని అలాగే 2024లో మోదీని మూడోసారి ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు