
మూడు దశాబ్దాలకు పైగా ఈనాడులో కవాడిగూడలో స్థానికంగా పనిచేస్తూ, సంఘ పరివార్ సంస్థలతో క్రియాశీలకంగా సంబంధాలు గల ఎర్రం నర్సింగ్ రావు సోమవారం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్ లో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు నర్సింగ్ రావు కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా అఖిల భారతీయ అధ్యక్షులు సంజయ్ ఉపాధ్యాయ ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు.
గత రెండు సంవత్సరాల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఆదివారం రాత్రి ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. జర్నలిస్ట్ నేతగా తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ కు నర్సింగ్ రావు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి గా, హౌసింగ్ సొసైటీకి ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. అంతకుముందు హైదరాబాద్ జర్నలిస్ట్స్ యూనియన్ కార్యదర్శి గా పని చేశారు. సమాచార భారతికి పాత్రికేయుల మండలి కార్యవాహగా పనిచేశారు. ప్రతి ఏడాది నారద జయంతి, ఇతర కార్యక్రమాల నిర్వహణలో ఉత్సాహంగా పాల్గొనేవారు. జర్నలిస్టుల సమస్యలపై చిత్త శుద్ధితో, అంకిత భావంతో నిస్వార్థంగా పని చేశారు. వారి వృత్తి పట్ల కూడా అంకితభావంతో పని చేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి