
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన కార్యక్రమం మంగళవారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. పరిశీలన తర్వాత ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఈ నెల 3న ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే.
అత్యధికంగా గజ్వేల్‌లో 114 మంది, కామారెడ్డిలో 58 నామినేషన్లు వేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. గజ్వేల్ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్, కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఆ తర్వాత మేడ్చల్‌లో 67, ఎల్బీనగర్లో 50, కొడంగల్‌లో 15 మంది, బాల్కొండలో 9 బరిలో ఉన్నారు.
నాగార్జున సాగర్‌లో జానారెడ్డి, హుజూరాబాద్‌లో ఈటల జమున నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు సమాచారం. తప్పులు సరిచేయడానికి అవకాశం ఉన్నా ఆర్వోలు రిజెక్ట్ చేశారని బీఎస్పీ ఆరోపిస్తోంది.
ఇక బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లో కూడా తప్పులు ఉన్నాయని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఖమ్మంలో పువ్వాడ అజయ్ నామినేషన్లో తప్పులున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కానీ ఆర్వో పట్టించుకోవట్లేదని.. దీనిపై కోర్టుకు వెళ్తామని తుమ్మల పేర్కొన్నారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత