
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 నియోజకవర్గాల్లో 75 స్థానాల్లో మహిళా ఓటర్లదే పైచేయి. 44 నియోజకవర్గాల్లో మాత్రం పురుషులు అధికంగా ఉన్నారు. ఇక జిల్లాల వారీగా చూస్తే 26 జిల్లాలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగతా 7 జిల్లాలో హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో పురుషులు ఎక్కువగా ఉన్నారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 9,99,967 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. అక్టోబరు 4న ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించిన జాబితా ఆధారంగా 18 – 20 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు ఏకంగా 8,11,468 మంది ఉండగా అక్టోబర్ 31 తర్వాత ప్రకటించిన జాబితాలో మరో 1,88,019 మంది ఓటర్లు నమోదు అయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,676 మంది, సర్వీస్ ఓటర్లు 15,406 మంది ఉన్నారు.
• మొత్తం ఓటర్లు – 3,26,18,205
• పురుష ఓటర్లు – 1,62,98,418
• మహిళా ఓటర్లు – 1,63,01,705
• కొత్త ఓటర్లు – 9,99,967
• సర్వీస్ ఓటర్లు – 15,406
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
తెలుగు రాష్ట్రాల స్వదేశీ జాగరణ్ మంచ్ సారధిగా రాచ శ్రీనివాస్
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు