
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండల్ మూడు రోజుల సమావేశాలు గుజరాత్ లోని భుజ్ లో ఆదివారం సర్దార్ పటేల్ విద్యా సంకుల్‌లోని శ్రీ కచ్చి లేవా పటేల్ సమాజ్‌లోని మాతృశ్రీ ధన్‌బాయి ప్రేమ్‌జీ గ్యాంగ్జీ భూడియా కమ్యూనిటీ హాల్‌లో ప్రారంభమయ్యాయి.
ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే భారత మాత చిత్రపటంకు పూలమాలలు వేసి నివాళులర్పించి సమావేశాలను ప్రారంభించారు. సంఘ్ పరిభాషలో 11 క్షేత్రాలు, 45 ప్రాంత్ ల సంఘచాలక్‌లు, కార్యవాహులు, ప్రచారక్‌లు, అఖిల భారతీయ కార్యకరణి సదస్యలతో సహా 382 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
వారిలో దేశవ్యాప్తంగా ఉన్నసంఘ్ స్పూర్తితో పనిచేసే కొన్ని సంస్థలకు చెందిన అఖిల భారతీయసంఘటనా కార్యదర్శులు కూడా పాల్గొంటున్నారు. ప్రారంభ బైఠక్‌లో దత్తాత్రేయ హోసబాలే కార్యకర్తలందరికీ స్వాగతం పలికారు. జాతికి, సమాజానికి విశేష సేవలందించిన వ్యక్తులకు నివాళులర్పించారు.
ఈ మధ్య కాలంలో మృతి చెందిన సీనియర్ ప్రచారక్ లు రంగ హరి, మదందాస్ దేవి, ప్రముఖ రచయిత తారక్ ఫతాహ్, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్, మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ, పూర్వ సైనిక్ సేవా పరిషత్ వ్యవస్థాపక సభ్యుడు కమాండర్ బాలకృష్ణ జైస్వాల్, మహిళా కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి సుశీల బాలుని, పద్మ భూషణ్ ఎన్. విఠల్ లతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రముఖులకు నివాళులు అర్పించారు.
ఇటీవల నేపాల్‌లో సంభవించిన భూకంప మృతులకు కూడా సంతాపం తెలిపారు. ఈ బైఠక్‌లో, భారత్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఇటీవల సంభవించిన వరదలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు. స్వయంసేవకులు ప్రత్యేకంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, నాగ్‌పూర్‌లలో సమాజంలోని వివిధ ప్రాంతాలలో వరదలకు గురైన ప్రజలకు సహాయం, సేవా కార్యక్రమాలు చేశారు.
బైఠక్‌లో, సంఘ శతాబ్ది వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని పనుల విస్తరణకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను సమీక్షిస్తారు. సంఘ శిక్షా వర్గానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. అంతే కాకుండా, సర్ సంఘచాలక్ డా. భగవత్ విజయదశమి ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు – ప్రకృతికి వ్యతిరేకంగా జీవన విధానం, ప్రపంచంపై వాతావరణ మార్పుల ప్రభావం, భద్రతపై విధానాలు, స్వావలంబన మొదలైన వాటికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు, ఇతర ముఖ్యమైనవి. అనే అంశాలపై చర్చించనున్నారు.
సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, గౌ సేవ, గ్రామసేవ, ఇతర కార్యకలాపాల కోసం జరుగుతున్న ప్రయత్నాల గురించి సమగ్ర సమాచారం కూడా సేకరించబడుతుంది. బైఠక్ నవంబర్ 7 సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!