
ఇంకా నామినేషన్ల పక్రియ ప్రారంభం కాకుండానే ఎన్నికల ప్రచారం సమయంలోనే తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత గమనిస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థులలో, ముఖ్యంగా ప్రస్తుతం ఎమ్యెల్యేలలో తీవ్ర అసహనం వెల్లడి వాడుతుంది. దానితో సహనం కోల్పోయి ప్రత్యర్థులపై భౌతిక దాడులకు దిగుతున్నారు.
తాజాగా, కుత్బుల్లాపూర్ లో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన సభలో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం ఘర్షణకు దారితీసింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సహనం కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్యెల్యే కూన శ్రీశైలం గౌడ్ గొంతు పట్టుకొని భౌతిక దాడికి దిగడం కలకలం రేపింది.
ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఆరోపణలు తీవ్రమై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సహనం కోల్పోయి శ్రీశైలంగౌడ్ మీదకు దూసుకెళ్లారు. శ్రీశైలంగౌడ్ గొంతు పట్టుకున్నారు. దీంతో అక్కడున్న పోలీసులు వారిని వారించారు. దీంతో చర్చా కార్యక్రమం రసాభాసగా మారింది.
బహిరంగ చర్చ సందర్భంగా పరస్పరం భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఆరోపణలు తీవ్రమై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సహనం కోల్పోయి శ్రీశైలంగౌడ్ మీదకు దూసుకెళ్లారు. శ్రీశైలంగౌడ్ గొంతు పట్టుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు.. కార్యకర్తలు వారిద్దరిని విడిపించారు.
ఇక ఈ ఘటనతో కార్యకర్తలు కూడా కోపోద్రిక్తులయ్యారు. దీంతో చర్చ కాస్త రచ్చ రచ్చగా మారిపోయింది. ఇరు పార్టీల కార్యకర్తలు కుర్చీలు విసురుకుని దాడులకు పాల్పడ్డారు. అప్పటివరకు చర్చా గోష్టిగా ఉన్న వాతావరణం కాసేపట్లోనే రణరంగంగా మారింది. కూన శ్రీశైలం గౌడ్ పై దాడిని బీజేపీ ఖండించింది. బీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు.
కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గొంతు నొక్కుతూ భౌతిక దాడి చేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదని పేర్కొంటూ బీఆర్ఎస్ నాయకుల అహంకారానికి ఇది పరాకాష్ట అని మండిపడ్డారు.
బిజెపి నేతపై భౌతిక దాడికి పాల్పడటాన్ని బిజెపి ఎంపీ, ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. బిఆర్ఎస్ అభ్యర్థులు స్థానికంగా, రాష్ట్రంలో ఓటమి తప్పదనే భయంతో సమాధానం చెప్పుకోలేక ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ నాయకులు మానసికంగా తమ ఓటమిని అంగీకరించినట్లే అని చెప్పారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత