రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం
ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హరీశ్‌ రావత్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రావత్‌ మంగళవారం రాత్రి హల్ద్వానీ నుంచి ఉధమ్‌సింగ్‌ నగర్‌లోని కాశీపూర్‌కు కారులో బయలుదేరారు.
బాజ్‌పూర్‌ వద్దకు రాగానే రావత్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.  మాజీ సీఎంను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ని డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం రావత్‌ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదం గురించి హరీశ్‌ రావత్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

 ‘హల్ద్వానీ నుంచి కాశీపూర్‌కు వెళ్తున్న సమయంలో నా కారు ప్రమాదానికి గురైంది. బాజ్‌పూర్‌లో ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాకు స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. నా సహచరులు కూడా బాగానే ఉన్నారు’ అని ట్వీట్‌ చేశారు.

రావత్ తో పాటు ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ తో సహా, ఇతర సహచరులూ గాయపడ్డారు. ఉదయం 12.15 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ అప్రమత్తతతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఛాతిలో నొప్పి రావడంతో రావత్ ని హుటా హుటినా ఆసుపత్రికి తరలించారు.