
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో నవంబర్ 7 వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.
ఈ కేసులో ఇవాళ్టి వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ విచారణను నవంబర్ 7కు హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని కోర్టు తెలిపింది. దీంతో ముందస్తు బెయిల్ నవంబర్ 7 వరకు పొడిగించినట్లు అయింది. సుప్రీంకోర్టులో 17ఏ పై విచారణ కొనసాగుతోందని, దీనిపై అనుకూలంగా తీర్పు వస్తే, ఈ కేసుకు వర్తిస్తుందని చంద్రబాబు లాయర్లు కోర్టుకు తెలిపారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ14గా నారా లోకేశ్ ను కూడా చేర్చింది. మాజీ మంత్రి నారాయణ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు గత 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో పాటు ఐఆర్ఆర్, ఫైబర్ నెట్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబును విచారణకు సీఐడీ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు కోర్టుల్లో పోరాటం చేస్తున్నారు.
కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై మంగళవారం తుది విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం…ఇరుపక్షాల వాదనల తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసులో తుది తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ