
గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. జాతి నిర్మాణంలో ఆదివాసీల త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోయేలా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్లతో ట్రైబల్ మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
అలాగే రూ.6.5 కోట్లతో నిర్మించిన గిరిజన పరిశోధనా కేంద్రాన్ని అతి త్వరలో ప్రారంభించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలోని రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా ప్రధాని ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు.
తెలంగాణలో రూ.420 కోట్లతో 17 కొత్త ‘ఏకలవ్య’ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలను ఆకాంక్ష జిల్లాలుగా గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కింద భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కేంద్ర ప్రభుత్వంరూ.37 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.
స్వదేశ్ దర్శన్ కింద రూ.80 కోట్లతో ములుగు-లక్నవరం-తాడ్వాయి-దామరవా
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు