హమాస్ దాడులతో మధ్యప్రాచ్యంలో రాజకీయ అనిశ్చితి కారణంగా చమురు సరఫరాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వివాదం సాగుతున్న ప్రాంతంలో వాణిజ్య ప్రాధాన్యతపై ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మాట్లాడుతూ అంతర్జాతీయ ఇంధనానికి ఆ ప్రాంతం సెంట్రల్ హబ్‌గా ఉందని గుర్తు చేశారు.
అయితే, ఎలాంటి పరిస్ధితులు ఉత్పన్నమైనా భారత్ దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఇలాంటి అనిశ్చితి పరిస్ధితులు సురక్షిత ఇంధనాల వినియోగం ప్రాధాన్యతను పెంచుతాయని చెప్పారు. ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటితే ద్రవ్యోల్బణం పరుగులు పెడుతుందని, భారత్ వంటి ముడిచమురు దిగుమతి దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

More Stories
భారత్ ఎగుమతులపై మెక్సికో 50 శాతం సుంకాలు
ఇండిగో ప్రయాణికులకు రూ.10వేలు విలువైన ట్రావెల్ వోచర్స్
ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం