కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి దానికి జవసత్వాలు కలిగించేందుకు టాటా సన్స్ పలు చర్యలు చేపట్టింది. దాని అభివ్రుద్ధిలో భాగంగా సంస్థ లోగో, ఎయిర్ క్రాఫ్ట్ లివరీలో మార్పులు తీసుకొచ్చింది. ఈ నయాలుక్ లోకి వచ్చిన విమానాల ఫస్ట్ లుక్’ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది.
ఫ్రాన్స్‌లోని టౌలోసీ వర్క్‌షాప్‌లో న్యూ లోగో, డిజైన్‌తో సరికొత్తగా రూపుదిద్దుకున్న ఏ350 విమానం ఫోటోలను ఎయిర్ ఇండియా తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ శీతాకాలంలో ఏ350 విమానాలను స్వదేశానికి రానున్నాయి. ‘ద విస్టా’గా వ్యవహరించే కొత్త లోగోలో బంగారం వన్నెతో మహారాజా మస్కట్ విండో ఫ్రేమ్ చేర్చారు.
అపరిమిత అవకాశాలు, ప్రగతి శీలత, భవిష్యత్‌పై తమ విమానయాన సంస్థకు గల విశ్వాసానికి, ధైర్యానికి సంకేతంగా ఈ లోగో డిజైన్ చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిరిండియా లోగోలో పాంట్ కూడా మార్చారు. అందుకోసం సొంతంగా ‘ఎయిర్ ఇండియా శాన్స్’ ఫాంట్ డిజైన్ చేశారు. ఎరుపు, ఉదా, బంగారం రంగులతో విమానం డిజైన్‌నూ మార్చేశారు.
తమ పాత విమానాలన్నీ కొత్త డిజైన్ లోకి మారతాయని ఎయిరిండియా వెల్లడించింది. వచ్చే డిసెంబర్ నుంచి కొత్త ఎయిర్ ఇండియా లోగోతో కొన్ని విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. వచ్చే రెండేండ్లలో తమ విమానాలన్నీ కొత్త లోగోలోకి మారతాయని వెల్లడించింది.
More Stories
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం
మహా కుంభ మేళాకు వెళ్లే వారికి 13వేల రైళ్లు
బిలియనీర్లు అధికంగా ఉన్న దేశాలలో మూడో స్థానంలో భారత్