న్యాయవ్యవస్ధలో అవినీతిపై చేసిన వ్యాఖ్యలకు గాను రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హైకోర్టుకు క్షమాపణ తెలిపారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాదించిఉంటే మన్నించాలని లిఖితపూర్వకంగా ఆయన క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు తన ఆలోచన కాదని స్పష్టం చేశారు.
న్యాయ వ్యవస్ధపై గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు గత నెలరోజులుగా దుమారం రేపుతుండగా ఆయన క్షమాపణలు కోరడంతో ఈ వివాదానికి తెరపడింది.
ఆగస్ట్ 30న సీఎం విలేకరులో మాట్లాడుతూ న్యాయవ్యవస్ధలో అవినీతి పెరిగిపోయింది. కొందరు న్యాయవాదులు రాసిచ్చిన తీర్పులే తర్వాత వెలువడుతున్నాయని కూడా తాను విన్నానని వ్యాఖ్యానించారు.
సీఎం వ్యాఖ్యలను న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. రాజస్ధాన్‌లోని జోధ్‌పూర్‌లో న్యాయవాదులు సమ్మెకు దిగడంతో పాటు సీఎంపై కేసు నమోదు చేశారు. గెహ్లాట్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ కొందరు పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 5న ఈ పిటిషన్‌పై విచారణ జరగనుండటంతో గెహ్లాట్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. తనకు న్యాయవ్యవస్ధ పట్ల అపార గౌరవం ఉందని, న్యాయవ్యవస్ధలో అవినీతి గురించి చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం కాదని పేర్కొన్నారు.

More Stories
షాహీన్‌కు పుల్వామా దాడి సూత్రధారి భార్యతో సంబంధాలు!
పార్టీ ఫిరాయించిన ఎమ్యెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు
ఉగ్రకుట్రకు అడ్డాగా అల్ ఫలాహ్‌లో 17వ నంబర్ భవనం