
బాలీవుడ్ లెజెండరీ నటి, డ్యాన్సర్ వహీదా రెహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. ఐదు దశాబ్దాల పాట భారత సినీ రంగానికి ఆమె అందించిన సేవలకుగానూ 2021 సంవత్సరానికి ఆమెకు ఈ అవార్డు దక్కినట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన కృషికి గుర్తుగా ఆమెకు ఈ అవార్డును బహూకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
‘నారీ శక్తి వందన్’ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తరుణంలోనే ఆమెకు జీవిత సాఫల్య పురస్కారం రావడం అందరూ గర్వంచదగిన విషయం అని తెలిపారు. వహీదా రెహమాన్ వయసు 85 ఏళ్లు. 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో వహీదాకు ఫాల్కే అవార్డును అందజేయనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కమిటీలోని అయిదుగురు సభ్యులు వహీదా రెహమాన్ పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
1955లో ‘రోజు మారాయి’ తెలుగు చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు వహీదా రెహమాన్. ఈ చిత్రంలోని ‘ఏరువాక సాగారో రన్నో..’ పాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. తదుపరి జయసింహ, బంగారు కలలు, సింహాసనం, చుక్కల్లో చంద్రుడు చిత్రాల్లో నటించారు. 2018లో కమల్‌హాసన్ తెరకెక్కించిన ‘విశ్వరూపం-2’ చిత్రంలో కశ్మీరీ మదర్‌గా నటించారు. అయితే ఆమె కెరీర్‌లో ఎక్కువ హిందీ చిత్రాల్లో నటించారు.
ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌదవి కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, గైడ్, ఖామోషి, ఢిల్లీ 6 వంటి చిత్రాలతో వహీదా రెహమాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిసారిగా కమల్ హాసన్ విశ్వరూపం, స్కేటర్ గర్ల్ సినిమాలో వహీదా అతిథి పాత్రలో మెరిసింది. ఆమె నటించిన రేష్మా అండ్ షెర చిత్రానికి జాతీయ ఉత్తత చిత్రం అవార్డు వచ్చింది.
వహీదా రెహ్మాన్‌ను 1972లో భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారంతో, 2011లో పద్మ్ఘభూషణ్ పురస్కారంలో సత్కరించింది. ఐదు దశాబ్ధాలకుపైగా నటిగా భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకుగానూ ఇప్పుడు ప్రతిష్ఠాత్మక దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు వరించింది. వహీదా ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. 1974లో శశిరేఖిని ని వివాహం చేసుకున్నారామె. 2000 సంవత్సరంలో భర్త మరణించడంతో ఆమె తన పిల్లలతో కలిసి ముంబైలో ఉంటున్నారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు