రైలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి రూ. 2.5 లక్షల పరిహారం అందజేయనుంది రైల్వే బోర్డు. ఇక స్వల్ప గాయాలపాలైన ప్రయాణికులకు రూ. 50,000 ఇస్తామని ప్రకటించింది. అంతే కాకుండా తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన ప్రయాణికులకు రోజు వారి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని రైల్వే ప్రకటించింది.
అది కూడా 30 రోజులకు మించి ప్రయాణికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటూ అతనికి రోజుకు 3వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు తెలిపింది. రైలు ప్రమాదాలతో పాటు సిగ్నల్స్,కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ వద్ద జరిగే ప్రమాదానికి గురైన వారికి పెంచిన పరిహారం అందజేయాలని రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు తక్షణం అమల్లోకి వచ్చాయి.
గతంలో రైలు ప్రమాదాలలో గాయపడిన వారికి కేవలం రూ. 5,000 పరిహారం మాత్రమే ఇచ్చేది రైల్వే బోర్డు. ఇప్పుడు దాన్ని కూడా 10 రెట్లు పెంచింది. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి 10రోజులకు ఒకసారి ఎక్స్‌గ్రేషియా చెల్లించనుంది. ఉగ్రదాడులు, హింసాత్మక ఘటనలు, రైళ్లలో దోపిడీలు వంటి అవాంఛిత ఘటనల సమయంలో ఈ పరిహారాలు వరుసగా రూ.1.50 లక్షలు, రూ.50 వేలు, రూ. 5 వేలుగా నిర్ణయించారు. సెప్టెంబర్ 18న జారీ చేసిన ఈ కొత్త ఉత్తర్వులు వెంటనే ఆచరణలోకి వస్తాయని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

More Stories
సముద్రంలో చిక్కుకుపోయిన 70 వేల టన్నుల బాస్మతి బియ్యం
ఇంధన సరఫరాపై భారత్కు రష్యా భరోసా
ఆరు కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు, క్షిపణులకై రూ. 5,083 కోట్ల ఒప్పందం