ఎన్ కౌంటర్ ముగిసింది కానీ ఆ ప్రాంతంలో ఇతర ఉగ్రవాదులు కానీ, వారి సామగ్రి కానీ ఉందేమోనన్న కోణంలో గాలింపు కొనసాగుతుందని కశ్మీర్ అదనపు డీజీపీ తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో మరో ఉగ్రవాది కూడా చనిపోయి ఉండిఉండవచ్చన్న అనుమానం ఉందని పేర్కొన్నారు. అనంత్ నాగ్ జిల్లాలోని గారోల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.
ఈ ప్రాంతం అత్యంత విశాలంగా, దట్టమైన అడవితో ఉన్నందున, లష్కరే తోయిబా స్థానిక కమాండర్ ఉజైర్ ఖాన్ కు ఈ ప్రాంతం కొట్టిన పిండి అయినందున ఎన్ కౌంటర్ క్లిష్టంగా మారిందని తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో 19 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మరో మేజర్ ఆశిష్ దోంచక్, డీఎస్పీ కేడర్ లో ఉన్న జమ్మూకశ్మీర్ పోలీస్ అధికారి హుమాయిన్ భట్, ఆర్మీ జవాను ప్రదీప్ ప్రాణాలు కోల్పోయారు.
ఎన్ కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని ఏడీజీపీ విజయ్ కుమార్ స్థానికులను కోరారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులకు చెందిన గ్రెనేడ్ లు, మందుపాతరలు ఉండి ఉండవచ్చని హెచ్చరించారు. ఈ ఎన్ కౌంటర్ లో సాయుధ డ్రోన్లు, హెలీకాప్టర్ల సేవలను భద్రతా దళాలు ఉపయోగించుకున్నాయి. డ్రోన్ల సాయంతో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశాయి. డ్రోన్ కు అమర్చిన కెమెరా సాయంతోనే ఒక ఉగ్రవాది మరణించిన విషయాన్ని నిర్ధారించాయి.

More Stories
అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో బంగ్లా వలసదారులు!
ఐదు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ పేలుడులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు!