
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్ (సమన్వయ సమావేశం) గురువారం ఉదయం 9 గంటలకు పూణెలో ప్రారంభమైంది. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సార్ కార్యవహ్ దత్తాత్రే హోసబాలే భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేయడంతో సమావేశం ప్రారంభమైంది.
ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తితో వివిధ సామజిక రంగాలలో పనిచేస్తున్న36 సంస్థలకు చెందిన 30 మంది సోదరీమణులు సహా 267 మంది ఆఫీస్ బేరర్లు ఈ మూడు సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో ప్రముఖులందరూ ఆర్‌ఎస్‌ఎస్ సహా సర్ కార్యవాహలు డా. కృష్ణగోపాల్, డాక్టర్ మన్మోహన్ వైద్య, అరుణ్ కుమార్, ముకుందా, రామదత్ చక్రధర్ ఉన్నారు.
అలాగే అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు భయ్యాజీ జోషి, సురేష్ సోనీ, వి.భాగయ్య, రాష్ట్ర సేవిక సమితి ప్రముఖ్ సంచాలికా శాంతక్కా, ప్రముఖ్ కార్యవాహక అన్నదానం సీతక్క, మహిళా సమన్వయ్ నుంచి చందతై, స్త్రీ శక్తి నుంచి శైలజా, రాష్ట్రీయ సేవాభారతి నుంచి రేణు పాఠక్ ఉన్నారు.
వనవాసీ కల్యాణ్ ఆశ్రమ కార్యాధ్యక్షుడు రామచంద్ర ఖరాది జి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి రాజ్ శరణ్ షాహి, బిజెపి అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, భారతీయ కిసాన్ సంఘ్ సంఘటన్ మంత్రి దినేష్ కులకర్ణి, విద్యాభారతి నుండి రామకృష్ణారావు, పూర్వ సైనిక్ సేవా పరిషత్ నుండి లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్.) విష్ణుకాంత్ చతుర్వేది, భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు హిరణ్మయ్ పాండ్యా, సంస్కృత భారతి సంస్థాన్ మంత్రి దినేష్ కామత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుత జాతీయ, సామాజిక పరిస్థితులు, విద్య, సేవ, ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు మూడు రోజుల సమావేశంలో చర్చిస్తారు. పర్యావరణం, కుటుంబ ప్రబోధన్ (కుటుంబ జ్ఞానోదయం), సామాజిక ఐక్యత, స్వదేశీ ప్రవర్తన, పౌర విధులు వంటి సామాజిక మార్పు సంబంధిత అంశాలపై కూడా చర్చిస్తారు. సంస్థాగత విస్తరణ, ప్రత్యేక ప్రయోగాల వివరాలు పరస్పరం తెలియజేసుకుంటారు.
More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్కు ఎంతో కీలకం