
భారత నౌకాదళం కోసం ఐదు నౌకలను కొనుగోలు చేయడం కోసం రక్షణ మంత్రిత్వ శాఖ విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్)తో రూ.19,000 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేసింది. 44,000 టన్నుల కేటగిరీకి చెందిన ఈ నౌకలను ఒక భారతీయ షిప్‌యార్డ్ నూవీ కోసం నిర్మిస్తుండడం ఇదే తొలిసారని అధికారులు చెప్పారు.
విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ దేశీయంగా ఈ నౌకల డిజైన్‌ను రూపొందించి నిర్మిస్తుండడంతో రక్షణ రంగంలో స్వావలంబన లక్ష సాధనలో ఇదొక పెద్ద ముందడుగు అవుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘దాదాపు రూ 19,000 కోట్లతో భారత నౌకాదళం కోసం ఐదు సపోర్టింగ్ షిప్‌ల కొనుగోలు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఈ రోజు(ఆగస్టు 25న) విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌తో ఒక ఒప్పందంపై సంతకాలు చేసింది’ అని ఆ ప్రకటనలో తెలిపింది.
ఈ నెల 16న జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నౌకల కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. భారత నౌకాదళానికి చెందిన నౌకలు హార్బర్‌కు తిరిగి రాకుండా దీర్ఘకాలం సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా ఈ సపోర్టింగ్ షిప్‌లను ఇంధనం, నీరు, మందుగుండు, ఇతర స్టోర్స్ వంటి వాటితో సముద్రంలో మోహరిస్తారు.
అంతేకాకుండా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మనుషులను తరలించడానికి కూడా ఈ నౌకలను నియమించవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల రాబోయే ఎనిమిదేళ్ల కాలంలో దాదాపు168.8 లక్షల పని దినాలు అందుబాటులోకి వస్తాయని కూడా రక్షణ మంత్రిత్వ వాఖ ఆ ప్రకటనలో తెలిపింది.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు