
హవాలా, మనీ లాండరింగ్ ఆరోపణలతో రాయపాటి ఇల్లు, కంపెనీలలో ఈ సోదాలు జరుగుతున్నాయి. రాయపాటి కంపెనీతో పాటు 15 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.. ఈ కంపెనీకి చెందిన పలువురి ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు, హైదరాబాద్‌లో ఈ సోదాలు చేస్తున్నారు. గతంలో బ్యాంకుల నుంచి రూ.9394 కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలపై కేసు నమోదైంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వ్యక్తిగత అవసరాలకు వాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
ఇప్పటికే రాయపాటి సాంబశివరావుపై సీబీఐ కేసు నమోదు చేయగా, ఆ కేసు ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. పలు కంపెనీల్లో పెట్టుబడులు గుర్తించినట్లు తెలుస్తోంది. రాయపాటి సాంబశివరావు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. ట్రాన్స్ట్రాయ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి గతంలో మనీ లాండరింగ్ కేసు నమోదయింది.
జూబ్లీహిల్స్, మణికొండ పంజాగుట్టలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ట్రాయ్ డైరెక్టర్గా ఉన్న మాలినేని సాంబశివరావు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలున్నాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచి ఆయన ఇళ్లు, ఆపీసులపై ఏకకాలంలో ఈడీ సోదాలు జరుపుతోంది. దాదాపు 15 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ట్రాన్స్టాయ్ పవర్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ట్రాయ్ రోడ్డు ప్రాజెక్టులకు మాలినేని సాంబశివరావు డైరెక్టర్గా ఉన్నారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు