అణిచివేతకు గురవుతున్న వారు అధికారం దక్కించుకోవాలి

అణిచివేతకు గురవుతున్న వారు అధికారం దక్కించుకోవాలి

అణచివేతకు గురవుతున్న వారు అధికారం అధికారం దక్కించుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే , బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పిలుపిచ్చారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ఈటల రాజేందర్ ను బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్ శుభం కన్వెన్షన్ హాల్లో ఘనంగా సత్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగపరంగా కల్పించిన ఓటు హక్కు ఒక ఆయుధం అని, ఉన్న వారు లేని వారు ఎన్నికల సమయంలో ఓటు కోసం వచ్చేవారికి సరియైన సమాధానం చెప్పాలని కోరారు.  అందరం ఐక్యంగా ఉంటూ బీసీల రాజ్యాధికారం కోసం కృషి చేయాలని చెప్పారు. 

తన జీవిత తెరిచిన పుస్తకం లాంటిదని, అధికారం ఉన్నా లేకున్నా ప్రజాస్వామ్య పరిరక్షణ కృషి చేస్తానని తెలిపారు. హాస్టల్లో చదువుకొని కష్ట సుఖాలు అనుభవించిన వాడీనని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీ మారుతానని అసత్య ప్రసారాలు చేస్తున్నారని మండిపడ్డారు. “ఒక వ్యక్తిత్వం గల వ్యక్తినని నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితులలో వమ్ము చేయను” అని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వరదలు తో ప్రజల ప్రాణాలు పోయిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈటెల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విపత్తుల పై కేంద్రానికి నివేదిక పంపిస్తే కేంద్ర ప్రభుత్వం విచారణ కమిటీని వేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని చెబుతూ కెసిఆర్ ను ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికల్లో బిజెపికి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.