బంగ్లాదేశ్‌లో ఒక హిందూ ఆలయాన్ని ఒక వ్యక్తి ధ్వంసం చేశాడు. గుడిలోని విగ్రహాలను అపవిత్రం చేశాడు. స్థానికులు వెంబడించి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేశారు.
బ్రాహ్మణబారియా జిల్లాలోని నియామత్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 36 ఏళ్ల ఖలీల్ మియా గ్రామంలోని తన సోదరి ఇంటికి వచ్చాడు. అయితే కొందరు స్థానికులు, అతడి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి స్థానిక నియామత్‌పూర్ దుర్గా ఆలయంలోకి ఖలీల్ మియా ప్రవేశించాడు. ఆ గుడిలోని ఐదారు విగ్రహాలను అతడు ధ్వంసం చేశాడు.
స్థానిక హిందువులకు ఈ విషయం తెలియడంతో ఆ గ్రామంలో కలకలం రేగింది. కొందరు హిందువులు ఖలీల్ మియా వెంటపడ్డారు. అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో అరెస్ట్ చేశారు. నియామత్‌పూర్ సర్వజనిన్ దుర్గా మాతా ఆలయం అధ్యక్షుడు జగదీష్ దాస్ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Stories
భారత్, అమెరికాల మధ్య 10 ఏళ్ల రక్షణ ఒప్పందం
చాబహార్ పోర్ట్పై అమెరికా ఆంక్షల నుండి తాత్కాలిక ఊరట
అమెరికాలో వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు