దేశవ్యాప్తంగా టమాటా ధరలు తారాస్థాయికి చేరుకోవడంతో టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. టమాటా విస్తృతంగా పండించే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వాటిని కొనుగులు చేసి, ధరలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో పంపిణీ చేయాలని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకర వినియోగదారుల సమాఖ్యలను ఆదేశించింది.
శుక్రవారం నాటికి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వినియోగదారులకు అందుబాటు ధరల్లో టమాటాలు లభిస్తాయని ఆహార మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా టమాటా ధరలు తారాస్థాయికి చేరుకోవడంతో టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.
టమాటా విస్తృతంగా పండించే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వాటిని కొనుగులు చేసి, ధరలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో పంపిణీ చేయాలని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకర వినియోగదారుల సమాఖ్యలను ఆదేశించింది. శుక్రవారం నాటికి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వినియోగదారులకు అందుబాటు ధరల్లో టమాటాలు లభిస్తాయని ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది.
‘గుజరాత్, మధ్యప్రదేశ్తోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి టమాటాలు సరఫరా అవుతున్నాయి. ఏపీలోని మదనపల్లె నుంచి సరైన పరిమాణంలోనే వస్తున్నాయి. ఢిల్లీకి హిమాచల్తోపాటు కర్ణాటక నుంచి అధికంగా వస్తాయి. మహారాష్ట్రలోని, నారాయణ్గావ్, ఔరంగాబాద్తోపాటు మధ్యప్రదేశ్ నుంచి త్వరలోనే అదనపు పంట రానుంది. దీంతో త్వరలోనే టమాట ధరలు దిగివచ్చే అవకాశం ఉంది’ అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అంచనా వేసింది.

More Stories
అమెరికాలో ముగిసిన షట్డౌన్
నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్జరీ.. రూ.99 లక్షలు స్వాహా
డిజిటల్ మీడియాలోనే అత్యధికంగా ఉల్లంఘనలు