
గురువారం ఈ అంశాన్ని ప్రస్తావించాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ల తరఫు న్యాయవాదికి సూచించింది. ఆదిపురుష్ చిత్రంపై దాఖలైన పిటిషన్లపై జులై 30న ఉత్తర్వులు జారీచేసిన అలహాబాద్ హైకోర్టు చిత్ర దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్, మాటల రచయిత మనోజ్ ముంతషీర్ జులై 27న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
అంతేగాక ప్రజల మనోభావాలు ఈ చిత్ర వల్ల దెబ్బతిన్నాయా? అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ చిత్రానికి జారీచేసిన సర్టిఫికెట్ విషయాన్ని సమీక్షించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.
అల్పమైన భాషతో కూడిన సంభాషణలతో రామాయణ గ్రంథాన్ని వక్రీకరిస్తూ నిర్మించిన ఆదిపురుష్ చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ కుల్దీప్ తివారీ, నవీన్ ధావన్ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటి విచారణ సందర్భంగా హిందువులు పవిత్రంగా భావించే రామాయణ కథను వక్రీకరించినట్లు సినిమా ఇతర మతాలకు చెందిన బైబిల్ లేదా ఖురాన్ లపై అటువంటి సినిమాలు తీయగలరా? అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్