పునఃప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

పునఃప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర
ప్రతికూల వాతావరణం కారణంగా మూడురోజులుగా నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర ఆదివారం పునఃప్రారంభమైంది. జమ్మూ-కశ్మీర్‌లోని పంజ్‌తర్ణి, శేష్‌నాగ్‌ క్యాంపుల నుంచి యాత్రికులు బయల్దేరారు పంజ్‌తర్ణిలో దాదాపు 1500 మంది చిక్కుకుపోగా వీరిలో దాదాపు 200 మంది తెలుగువారు ఉన్నారు. 
అమర్‌నాథ్‌ ఆలయం వద్ద వాతావరణం సానుకూలంగా మారిన వెంటనే అధికారులు గేట్లను తెరిచి భక్తులు హిమలింగానికి పూజలు చేసేందుకు అనుమతించారు. 
ఇప్పుడు వాతావరణం కొంతమేరకు తెరపినిచ్చింది. కాశ్మీర్‌లో వచ్చే 48 గంటల పాటు సాధారణ వాతావరణం నెలకొంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుగుణంగా శనివారం రాత్రి వర్షం పడట్లేదు. అడపా దడపా తేలికపాటి జల్లులు పడుతున్నాయే తప్ప- భారీ వర్షపాతం నమోదు కాలేదు.ప్రతికూల వాతావరణం కారణంగా గత శుక్రవారం నుంచి మూడు రోజులుగా యాత్ర నిలిచిపోయింది. అప్పటికి కేవలం ఆరు రోజులు మాత్రమే యాత్ర కొనసాగింది. ఆ ఆరు రోజుల్లో 67,566 మంది భక్తులు పవిత్ర మంచు లింగాన్ని దర్శించుకున్నారు.
మరోవైపు అనంతనాగ్‌లో సైన్యం తమ క్వాజిగుండ బేస్‌క్యాంప్‌లో 700 మంది యాత్రికులకు ఆశ్రయం కల్పించింది. ఇదివరకు ప్రతికూల వాతావరణం కారణంగా బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఇవ్వాళ ఎనిమిదో బ్యాచ్ అమర్‌నాథ్ దర్శనానికి బయలుదేరి వెళ్లాల్సి ఉన్నప్పటిక అది సాధ్యపడలేదు. ఎనిమిదో బ్యాచ్‌లో మొత్తం 7,010 మంది యాత్రికులు ఉన్నారు.
 
వారిలో 5,179 మంది పురుషులు, 1,549 మంది మహిళలు, 21 మంది పిల్లలు, 228 మంది సాధువులు, 33 మంది మహిళా సాధువులు ఉన్నారు. వారంతా 247 వాహనాల్లో వారిని బల్తాల్ పహల్గామ్‌ బేస్ క్యాంప్స్ నుంచి వెళ్లాల్సి ఉంది.  అమర్‌నాథ్ యాత్ర మొత్తం 62 రోజుల పాటు సాగుతుంది. జూలై 1వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 31వ తేదీ నాటికి ముగుస్తుంది. మరోవంక, జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారి మూతపడింది. దీంతో జమ్మూ నుంచి కొత్తగా యాత్రికులను మాత్రం ముందుకు అనుమతించడంలేదు