మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేసేందుకు శుక్రవారం సిద్ధమయ్యారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందించేందుకు రాజ్‌భవన్‌కు బయల్దేరారు. అయితే, బీరెన్ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేయడంతో ఆయన వెనక్కి తగ్గారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుతుల్లో తాను రాజీనామా చేయడం లేదంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు.
మణిపూర్ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రికి రాజీనామా చేయకూడదని ఎన్ బీరేన్ సింగ్ నిర్ణయించుకున్నారు. రాజీనామా లేఖను సమర్పించడానికి రాజ్‌భవన్‌కు వెళుతున్న ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కాన్వాయ్‌ను ప్రజలు అడ్డుకున్నారని రాష్ట్ర సీనియర్ మంత్రి గోవిందాస్ గొంతౌజం శుక్రవారం మధ్యాహ్నం విలేకరులకు తెలిపారు.
మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్‌కు వెళుతున్న ముఖ్యమంత్రి చేతిలోని రాజీనామా లేఖను ప్రజలు లాక్కుని చింపివేశారని ఆయన చెప్పారు. ఇంఫాల్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఎదుట భారీ సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా మహిలలు చేరుకుని ఆయన రాజీనామా చేయకూడదంటూ నినాదాలు చేశారని మంత్రి తెలిపారు.
శుక్రవారం ఉదయం 8 గంటలకు తన నివాసంలో క్యాబినెట్ మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలిసింది. దీంతో బీరేన్ సింగ్ రాజీనామా చేయడానికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు అంతకుముందు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే బీరెన్ సింగ్ రాజీనామా పత్రం చించేసి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ చేతుల్లో నుంచి రాజీనామా లేఖను లాక్కుని మహిళలు చించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన రాజ్‌భవన్‌కు చేరుకుంటారని, గవర్నర్ అనసూయ ఉకియ్‌తో సమావేశం అవుతారని పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఇందులో భాగంగా ఆయన ఇంటి నుంచి బయల్దేరిన వీడియోలు కూడా అన్ని మీడియాల్లో ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా తథ్యం అని అందరూ భావించారు. అయితే ఈ వార్తలు బయటకు రాగానే బీరెన్ సింగ్ ఇంటిక, ఆయనకు మద్దతుగా మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
రాజీనామా నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మార్చుకోవాలని నినాదాలు చేశారు. బీరెన్ సింగ్‌ను రాజ్‌భవన్‌కు వెళ్లనీయం అంటూ మానవహారంలా ఏర్పడ్డారు. ఇంఫాల్‌లోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన బీరేన్ సింగ్ కాన్వాయ్‌ను ముందుకు కదలకుండా మహిళలు అడ్డుకున్నారు. దీంతో తిరిగి తన నివాసం లోపలికి ముఖ్యమంత్రి వెళ్లారు.
రాజీనామా నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మార్చుకోవాలని నినాదాలు చేశారు. బీరెన్ సింగ్‌ను రాజ్‌భవన్‌కు వెళ్లనీయం అంటూ మానవహారంలా ఏర్పడ్డారు. ఇంఫాల్‌లోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన బీరేన్ సింగ్ కాన్వాయ్‌ను ముందుకు కదలకుండా మహిళలు అడ్డుకున్నారు. దీంతో తిరిగి తన నివాసం లోపలికి ముఖ్యమంత్రి వెళ్లారు.

More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!