
విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ నేతలకు ఆదాయపన్ను శాఖ నుండి నోటీసులు అందాయి. 84 గంటల పాటు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ ముమ్మర తనిఖీలు నిర్వహించింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పలు డాక్యుమెంట్స్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా ఎమ్యెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి ఐటీ నోటీసులు జారీ చేసింది.
నేడు సంబంధిత వివరాలు, ఆధారాలతో హైదరాబాద్‌లోని ఐటీ ఆఫీస్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఐటీ అధికారులు పేర్కొన్నారు. శేఖర్‌రెడ్డితోపాటు ఎమ్యెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. అయితే నేడు ఐటీ ముందు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరు కానున్నారు.
మర్రి జనార్దన్ రెడ్డి సమయం కోరనున్నారు. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిని గురువారం హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 50 బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు ఏకకాలంలో బీఆర్‌ఎస్ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నాయకుడి ఇళ్లలో సోదాలు చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ నాయకుడు కొండపల్లి మాధవ్ (ఈయన 20 ఏళ్లు బీజేపీలో ఉన్నారు) ఇళ్లలో దాడులు చేశారు.
హైదరాబాద్‌లోని ఐటీ కార్యాలయంలో సంబంధిత డాక్యామెంట్లతో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇటీవల వారి ఇళ్లల్లో ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆదాయ పన్ను లెక్కల్లో తేడాలుండడంతోనే ఈ సోదాలు చేసినట్లు సమాచారం. అయితే ఒకేసారి ముగ్గురు నేతల ఇళ్లలో ఐటీ దాడులు జరగడంతో బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
రెండేళ్ల కిందట కూడా బీఆర్‌ఎస్ నేతలకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. అప్పుడు కొందరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. సోదాలు పెద్దఎత్తున జరగకపోయినప్పటికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆందోళన చెందారు. తిరిగి వారం క్రితం ఏకకాలంలో ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నేత ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
More Stories
ఓయూలో ఉద్రిక్తత.. కాకతీయ వర్సిటీలో ఘర్షణ!
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రధాని మోదీ ఘన నివాళి
ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం