ఎన్హెచ్-17 సమీపంలోని పలువురు గ్రామస్థులు ఆదివారం రాత్రి సోనాలి నాథ్ మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహంపై తీవ్రంగా గాయాలు ఉన్నట్లు వారు చెబుతున్నారు. దుండగులు ఆమెపై దాడి చేసి హత్యానంతరం హైవేపై విసిరేసి పరారయినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసు బృందం దుండగుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టింది.
మృతురాలని గోలాపుర జిల్లా మతియా గ్రామ నివాసానికి చెదిన సోనాలి నాథ్గా గుర్తించినట్టు చెప్పారు. చివరిసారిగా ఆమె ఆదివారం మధ్యాహ్నం స్థానిక మార్కెట్లో కనిపించిందని, సాయంత్రం ఆమె భర్త ఫోన్ చేయగా ఫోను స్విచ్ఛాఫ్ అయినట్టు గుర్తించారని చెబుతున్నారు.
కాగా, ఈ ఘటన దురదృష్టకరమని, దీనిపై పూర్తి విచారణ జరిపించి న్యాయం చేస్తామని అసోం మంత్రి అశోక్ సింఘాల్ ఒక ట్వీట్లో తెలిపారు. హత్య ఘటన వెనుక కారణాలను వెలికితీస్తామని స్పష్టం చేశారు. సోనాలి నాథ్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
కాగా, సోనాలి నాథ్ హత్యపై అసోం బీజేపీ అధ్యక్షుడు భబేష్ కలితాయభబేష్ కలితాయ విచారం వ్యక్తం చేశారు. దుండగులను విడిచిపెట్టరాదని రాష్త్ర ప్రభుత్వాన్ని కోరారు.

More Stories
మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంపై విస్తృత ప్రచారం.. కేసు నమోదు
మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం
ఎస్ఐఆర్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకిని అనుమతించం