
‘‘ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను కేసీఆర్ ప్రభుత్వం నిషేధిస్తోంది. ఉద్యమించే నాయకులను అరెస్ట్ చేసి బెదిరిస్తోంది. మరో 5 నెలలు ఆగండి… తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్ ను నిషేధించబోతున్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ లోని నిజాం కాలేజీ మైదానంలో ‘‘ఖేలో భారత్- జీతో భాగ్యనగర్’’ పేరిట నిర్వహించిన క్రీడల పోటీల ఫైనల్ మ్యాచ్ ను తిలకించడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖేలో ఇండియా పేరుతో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న అన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో క్రీడల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రాజధానిలో క్రీడలను ప్రోత్సహించాలనే ఆలోచనతో రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ‘‘ఖేలో భారత్ – జీతో భాగ్యనగర్’’ పేరిట పోటీలు నిర్వహించడం పట్ల సంతోషంగా ప్రకటించారు.
యువతకు క్రీడా స్పూర్తి చాలా అవసరం అంటూ క్రీడా స్పూర్తితో ఏ రంగంలోనైనా సమిష్టిగా పనిచేస్తే రాణించవచ్చని ఈ క్రీడలు చాటి చెబుతున్నాయని తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని అంటూ యూపీఏ హయాంతో పోలిస్తే క్రీడల బడ్జెట్ ను 8 రెట్లు అధికంగా కేటాయిస్తున్నారని చెప్పారు.
గతంలో క్రీడల్లో సెలెక్ట్ కావాలన్నా, అవార్డులు ఇవ్వాలన్నా పైరవీలు ఉండేవని, మోదీ వచ్చాక నైపుణ్యమే గీటురాయిగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆయా రంగాల్లో రాణించిన వారికి మాత్రమే అవార్డులు ఇస్తున్నారని వివరించారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలు మరింత ఇబ్బందుల్లో పడతారని సంజయ్ హెచ్చరించారు. స్విగ్గి, జొమాటో మాదిరిగా ఇంటింటికీ మద్యాన్ని పంపిణీ చేస్తాడని హెద్దేవా చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే నిలువ నీడ లేని పేదలకు ఇండ్లు కట్టిస్తాం, పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యన్ని అందిస్తా, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాం, విద్యార్గులకు ఇబ్బంది లేకుండా ఫీజు రీయంబర్స్ మెంట్ అందిస్తాం అంటూ హామీలు ఇచ్చారు.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
తెలుగు రాష్ట్రాల స్వదేశీ జాగరణ్ మంచ్ సారధిగా రాచ శ్రీనివాస్
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు