మణిపూర్ లోధ్వంసమైన దేవాలయాలను పునర్నిర్మించాలి

మణిపూర్‌లోని మెయిటీ సమాజ్, వారి ప్రార్థనా స్థలాలపై కుకీ మిలిటెంట్లు చేసిన భయంకరమైన దాడులను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. మణిపూర్ హిల్స్‌లోని మైతే సమాజ్‌కు చెందిన ఎంపిక చేసిన గొప్ప దేవాలయాల జాబితాను జిల్లాల వారీగా విడుదల చేస్తూ, ఘర్షణల సమయంలో దగ్ధమైన లేదా ధ్వంసమైన వాటిని పునర్నిర్మించాలని డిమాండ్ చేసింది. 
 
 విహెచ్‌పి జాతీయ సెక్రటరీ జనరల్ మిలింద్ పరాండే మాట్లాడుతూ, తాము ఇప్పటికే బాధిత ప్రజలకు, హిందూ సమాజానికి సేవ చేస్తున్నామని తెలిపారు. ఈ ఆలయాల పునర్నిర్మాణానికి ముందుకు రావాలని, ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చర్చిలపై మాత్రమే దాడి జరిగిందని తప్పుడు కథనాలను వ్యాప్తి చేయవద్దని హెచ్చరించారు.
 
ధ్వంసమైన 11 పెద్ద దేవాలయాల జాబితా విడుదచేస్తూ వాటిల్లో   తెన్‌గౌపాల్,  మోరెచ్‌లోని 4 ఆలయాలు, తిపైముఖ్ చర్చన్‌పూర్‌లోని 3,  చింగోయ్ చింగ్ ఇంఫాల్ ఈస్ట్‌లోని 4 ఆలయాలతో పాటు మరింకా ఉన్నట్లు తెలిపారు. రెండు వర్గాల మధ్య దురదృష్టకర ఘర్షణల సమయంలో అనేక చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయని మిలింద్ పరాండే చెప్పారు.
 
ఇప్పుడు హిందూ సమాజం పాడైన/ ధ్వంసమైన దేవాలయాలను పునర్నిర్మించేందుకు ముందుకు రావాలని కోరారు. శాంతి, సంయమనం పాటించాలని, దేశ వ్యతిరేక, సంఘ వ్యతిరేక అంశాలను నియంత్రించాలని వీహెచ్‌పీ విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగించే అంశాలు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.