ఇంగ్లండ్‌ లో రైల్వే కంపెనీల డ్రైవర్లు సమ్మె

ఇంగ్లండ్‌ లో రైల్వే కంపెనీల డ్రైవర్లు సమ్మె

ఇంగ్లండ్‌ వ్యాప్తంగా 15 రైల్వే కంపెనీల డ్రైవర్లు సమ్మెకుదిగారు. రైల్వే డ్రైవర్ల యూనియన్‌ అస్లెఫ్‌ నేతృత్వంలో సాగుతును ఈ సమ్మెతో చాలాచోట్ల రైలు సర్వీసులు స్తంభించిపోయాయి. వేతనాలపై ప్రభుత్వంతో వారికి సుదీర్ఘంగా వివాదం సాగుతోంది.  కరోనా సమయంలో రైల్వే కార్మికులు చేసిన త్యాగాలను గుర్తించాలని వారు కోరుతున్నారు. నాలుగేళ్ళ పాటు వేతన పెంపు జరగలేదని, ఇప్పటికైనా వేతనాలు పెంచాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. ప్రభుత్వంతో వివాదం ముదరడంతో వారు సమ్మెకు దిగారు.

అస్లెఫ్‌ యూనియన్‌తో పాటూ శనివారం నాడు ఆర్‌ఎంటి సభ్యులు కూడా విధులను బహిష్కరించారు. జనవరి ప్రారంభం నుండి మంత్రులు కనీసం యూనియన్‌ అధికారులను కూడా కలవలేదని అస్లెఫ్‌ అధ్యక్షుడు మైక్‌ వేలన్‌ వెల్లడించారు. సమ్మెలో భాగంగా మాంచెస్టర్‌, లివర్‌పూర్‌ల్లో పికెటింగ్‌లు సాగాయి. వాటిల్లో పాల్గను వేలన్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిపాదించిన 8శాతం వేతన పెంపును తీవ్రంగా విమర్శించారు. సాగినంత కాలమూ పారిశ్రామిక కార్యాచరణను కొనసాగించడానికే డ్రైవర్లు కూడా సిద్ధమయ్యారని హెచ్చరించారు.

”మమ్మల్ను తిరిగి విధుల్లోకి వచ్చేలా చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. లేదామేం సమ్మెను విరమిస్తామ నిభావిస్తోంది. కానీ అవేమీ జరగవు.” అని ఆయన స్పష్టం చేశారు.  సెంట్రల్‌ లండన్‌లోని పెడింగ్టన్‌ స్టేషన్‌ వద్ద జరిగిన పికెట్‌లో గ్రేట్‌ వెస్ట్రన్‌ రైల్వే వర్కర్‌ నరిందర్‌ రారు మాట్లాడుతూ, ఈ తరుణంలో దేశ ప్రజలు తమతో ఉన్నారని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, బస్సు డ్రైవర్లు, రైల్వే డ్రైవర్లు ఇలా అందరూ సమ్మె బాటలో వున్నారని పేర్కొన్నారు. తాము చేసిన త్యాగాలను గుర్తించాలనే కోరుతున్నామని చెప్పారు.