చట్టబద్ధ ఒప్పందాలను ఉల్లంఘిస్తే నష్టం అపారం

చట్టబద్ధ ఒప్పందాలను ఉల్లంఘిస్తే నష్టం అపారం
చట్టబద్ధమైన ఒప్పందాలను లేదా దీర్ఘకాలిక ఒప్పందాలను దేశాలు ఉల్లంఘినపుడు విశ్వాసం, నమ్మకానికి కలిగే నష్టం అపారమైనదని విదేశాంగమంత్రి జై శంకర్‌ హెచ్చరించారు. భారత్‌తో సరిహద్దు ఒప్పందాలను చైనా ఉల్లంఘించడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఆరవ హిందూ మహాసముద్ర దేశాల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ లాభదాయకం కానీ ప్రాజెక్టుల వల్ల తలెత్తే భరించలేని రుణ భారం పట్ల గణనీయమైన ఆందోళన వ్యక్తమవుతోందని తెలిపారు.
 
సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలను ఉల్లంఘించి తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ పొడవునా చైనా దూకుడుగా వ్యవహరించడం, పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించడానిు భారత్‌ తీవ్రంగా విమర్శిస్తోంది. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడం వల్ల ద్వైపాక్షిక సంబంధాల ప్రాతిపదిక మొత్తంగా తుడిచిపెట్టుకుపోయిందని భారత్‌, చైనాకు స్పష్టంగా తెలియచేసింది.
 
సరిహద్దుకు సంబంధించిన అన్ని సమస్యలను ప్రస్తుతం ఒప్పందాలకు అనుగుణంగా పరిష్కరించుకోవాలని కోరింది. ”గత రెండు దశాబ్దాల నుండి మన ప్రమాదం గురించి మనం విస్మరించిన పాఠాలు చాలా ఉన్నాయి. అపారదర్శకమైన రుణ పద్ధతులను, విపరీతమైన వెంచర్లను, మార్కెట్‌తో సంబంధం లేనిధరల పాయింట్లను మనం ప్రోత్సహించాలనుకుంటే ఇవనీు ఎప్పుడో ఒకప్పుడు మనల్ని ఇబ్బందులు పెడతాయి.” అని జై శంకర్‌ హెచ్చరించారు.
 
ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఆరవ హిందూ మహాసముద్ర దేశాల సమావేశంలో పాల్గనేందుకుజై శంకర్‌ ఢాకా వచ్చారు. ఈ సమావేశానికి మారిషస్‌ అధ్యక్షుడు పృధ్విరాజ్‌ సింగ్‌ రూపున్‌, మాల్దీవుల ఉపాధ్యక్షుడు ఫైజల్‌ నసీమ్‌, బంగ్లా ప్రధానిషేక్‌ హసీనా, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మంత్రులు హాజరయ్యారు. గురువారం ఢాకా చేరుకును జై శంకర్‌ ప్రధానిషేక్‌ హసీనాతో భేటీ అయ్యారు. పరస్పర ప్రయోజనాలు కలిగిన అంశాలపై ఇరువురు మాట్లాడుకున్నారు.