
మోచా తుపాను దిశను మార్చుకున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించడంతో భారత్కు మోచా తుపాను గండం తప్పిందని భావిస్తున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ వైపు మోచా తుపాను కదులుతున్నట్లు ఐఎండీ ప్రకటించింది. గంటకు 148 కిలో మీటర్ల వేగంతో తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మే 14న బంగ్లాదేశ్- మయన్మార్ తీరాల్లో మోచా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని మంగళవారం తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడింది. ఇది బుధవారం సాయంత్రం వరకు బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత మోచా తుపానుగా మారనుందని పేర్కొంది.
ఈ అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా బలపడుతూ శుక్రవారం నాటికి అతి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై మోచా తుపాను ప్రభావం ఉండనుంది ఐఎండీ ప్రకటించింది.
గురువారం వరకు ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పుంజుకుని ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల వైపు శుక్రవారం నాటికి వెళ్లే అవకాశం ఉందని వెల్లడించింది. మోచా తుపాను ప్రభావంతో మే 9వ తేదీ నుంచి 11 తేదీ వరకు అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
మే 9వ తేదీన గంటలకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. మే9వ తేదీ సాయంత్రం నుంచి 50 కిలో మీటర్ల నుంచి 70 కిలో మీటర్ల వేగంతో ..మే 10, 11వ తేదీల్లో 55 నుంచి 75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. మే 12, 13వ తేదీల్లో గాలుల వేగం 100 నుంచి 110 కిలో మీటర్లు ఉండొచ్చని అంచాన వేసింది.
More Stories
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా
శబరిమల ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయం
ఇకపై ఈవీఎం బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల కలర్ ఫొటో!