తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) పేరుతో గల మరో నకిలీ వెబ్‌సైట్ ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ 19,2023 యు/ఎస్ 420, 468, 471 ఐపీసీ ప్రకారం పోలీసులు నమోదు చేసి ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్ కు అప్పగించారు. సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్‌సైట్‌పై విచారణ ప్రారంభించారు. టీటీడీ పేరిట ఇప్పటికే 40 నకిలీ వెబ్‌సైట్లను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేయగా, తాజా దాంతో కలిపి మొత్తం కేసులు 41కి చేరాయి.
టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో కొద్దిపేటి మార్పులు చేసి ఈ నకిలీ వెబ్‌సైట్లు సృష్టిస్తున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. https ://tirupatibalaji.ap.gov.in/ పేరిట అధికారిక వెబ్‌సైట్ ఉండగా.. వీటికి చిన్నపాటి మార్పులు చేసి ఫేక్ వెబ్‌సైట్లను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. వీటి విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు. దీంతో పాటు టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను టీటీడీ దేవస్థానాన్ని కూడా వినియోగించవచ్చని వారు వెల్లడించారు.

More Stories
ఏపీకి ముంచుకొస్తున్న ‘మొంథా’ తుపాను ముప్పు
ఈ దశాబ్దం మోదీదే… బీహార్ లో ఎన్డీయే విజయం
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?