అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు బాటలు వేసుకుంటున్నందువల్ల మన దేశం ధర్మబద్ధమైన దేశంగా అభివృద్ధి చెందుతోందని, మతపరమైన కర్తవ్యాలను పాటిస్తోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. భారత దేశం మతపరమైన కర్తవ్యాలను నిర్వహించడాన్ని నమ్ముతుందని, అమెరికా, రష్యా, చైనా దేశాల మాదిరిగా నియంతృత్వ దేశంగా నిలవాలని కోరుకోదని స్పష్టం చేశారు.
వేద సంస్కృత జ్ఞాన గౌరవ సమారోహ్ లో ఆయన ఆదివారం మాట్లాడుతూ. ఇతరులకు సేవ చేయడాన్ని భారత దేశం నమ్ముతుందని, వేద కాలం నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నదని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు ఇతర దేశాలపై తమ అధికారాన్ని వినియోగిస్తాయని చెప్తూ, అందుకు ఉదాహరణ సోవియెట్ యూనియన్‌ను అమెరికా కూల్చడాన్ని గుర్తు చేశారు.
ఇప్పుడు చైనా అమెరికాపై అధికారం చెలాయించడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. అమెరికా, రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్‌ను పావుగా వాడుకుంటున్నాయని డా. భగవత్ ప్రస్తావించారు. అయితే, భారత దేశం ఎల్లప్పుడూ ఇతర దేశాలకు అవసరం అయినపుడు ఆదుకుంటోందని చెప్పారు.
మన దేశంతో ఆయా దేశాలకుగల సంబంధాలతో పని లేకుండా వాటికి సహాయపడుతోందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు సహాయపడాలని మన దేశం కోరుకుంటోందని చెబుతూ ఈ విషయంలో రష్యా, అమెరికా తమవైపు ఉండాలని భారత్ ను కోరామని, అయితే అన్ని దేశాలు తనకు స్నేహితులే అని భారత్ స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు.
పైగా, ఇది యుద్దానికి సమయం కాదని, యుద్దాన్ని ఆపాలసిందే అని నిక్కచ్చిగా భారత్ చెప్పిందని కూడా తెలిపారు. ప్రస్తుత మన దేశ విదేశాంగ విధానాన్ని భాగవత్ ప్రశంసిస్తూ గతంలో మన దేశం ఈ విధంగా తన వైఖరిని నిర్ణయించుకునేది కాదని గుర్తు చేశారు. శ్రీలంక రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నపుడు భారత దేశం అందించిన సహాయాన్ని దీనికి ఉదాహరణగా చెప్పారు.
శ్రీలంక ఎప్పుడూ చైనా లేదా పాకిస్థాన్ వైపు ఉండేదని, తన అంతర్గత వ్యవహారాల నుంచి భారత దేశాన్ని దూరంగా ఉంచేదని తెలిపారు. అయితే ఆ దేశం కష్టాల్లో ఉన్నపుడు కేవలం భారత దేశమే సహాయపడిందని గుర్తు చేశారు. ఏదైనా దేశంలో ఉన్న పరిస్థితినిబట్టి ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశం మన దేశానికి ఉండదని స్పష్టం చేశారు. మన దేశం ఇప్పుడు తన మతపరమైన విశ్వాసాలతో ముందుకు వెళ్తోందని చెబుతూ అటువంటి దేశాలు ఇతర దేశాల పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవాలని కోరుకోవని చెప్పారు. కాగా, టెక్నాలజీ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, సైన్స్ మతాన్ని పట్టించుకోదని డా. భగవత్ తెలిపారు. భవిష్యత్తులో కృత్రిమ మేధాశక్తి మానవ జాతిని కబళిస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతున్నట్లు తెలిపారు. మనం ఉనికిలేనివారం అవుతామని భయపడుతున్నారని చెప్పారు. సైన్స్ కూడా మానవులను జీవసంబంధ జంతువులుగా పరిగణిస్తుందని, కానీ మతాన్ని పరిగణనలోకి తీసుకోదని తెలిపారు.

More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు