కులాంతర వివాహాల పట్ల సంఘం, సమరసత వేదిక దృక్పథం ఏమిటి? వివాహం అనేది కేవలం ఇద్దరు మగ, ఆడా కలయిక కాదు.ఇద్దరూ ఏక మనస్కులై కలసి జీవించడం. ఉదా: అర్ధ, నారీశ్వరుడు. ఇద్దరూ కలసి దశాబ్దాల పాటు గృహస్థ బాధ్యతలను సక్రమంగా చేపట్టడం. ఆ ఇద్దరే కలసి ఉండడం మాత్రమే కాదు!
రెండూ కుటుంబాల అండ దండలు వీరు తీసుకోవడం, తర్వాత కాలంలో ఇద్దరి వైపు తల్లి తండ్రుల బాగోగులు వీరు ఇద్దరూ చూడడం. ఒకరు లేక ఇద్దరు పిల్లలు ఉన్న నేటి తరుణంలో,భార్యా,భర్త అన్ని బాధ్యతలూ ఇద్దరూ సమానంగా మోస్తున్న నేటి నూతన తరుణంలో వార్ధక్యంలో ఉన్న రెండు వైపులా ఉన్న తల్లి తండ్రుల బాగోగులు చూడడం ఇద్దరి సమాన బాధ్యత.
హీందవః సోదరాః సర్వే,
హిందువులు అందరూ కులాలు ఏవైనా సోదరులము ఆనది మన మౌలిక నమ్మకం, ఆచరణకు దిక్సూచి. ఏకులం పెద్దది కాదు,యే కులం తక్కువది కాదు. అస్పృశ్యత ఆచరించ తగదు. ఈ సూత్రంతో చూసినప్పుడు కులాంతర వివాహాలు మనకు సమ్మతం కావాలి.
“హిందువులు అందరూ సోదరులు” అన్నది ఆర్ఎస్ఎస్ మౌలిక విధానం. ఈ సైద్ధాంతిక పూర్వరంగంలో గత 98 ఏళ్లుగా సంఘ్ పనిచేస్తున్నది. 1974లో “సామజిక సమానత – హిందువుల ఐక్యత” గురించి ఆర్ఎస్ఎస్ మూడవ సర్ సంఘచాలకే శ్రీ బాలాసాహెబ్ దేవరస్ మాట్లాడుతూ ఈ విధంగా ప్రకటించారు: “సామజిక సమానత ద్వారానే హిందూ ఐక్యత సాధించగలం. హిందువులలో సామజిక ఐక్యత ఏర్పర్చడానికి కులాంతర వివాహాలు ఒక మార్గం. ఆర్ఎస్ఎస్ లో చాలామంది కులాంతర వివాహాలు చేసుకున్నారు. వ్యక్తిగతంగా నేను కులాంతర వివాహాలకు హాజరు కావడానికి ప్రాధాన్యత ఇస్తాను”.
అందరూ వెంటనే కులాంతర వివాహాలు చేసుకోక పోవచ్చును. అందరి తల్లిదండ్రులు చేయలేక పోవచ్చును. అయితే కులాంతర వివాహాలు మన ధర్మానికి వ్యతిరేకం కాదు అని మనకు నమ్మకం కుదరాలి. మన ప్రాచీన చరిత్రలో ఇలాంటి వర్ణాంతర,కులాంతర వివాహాల ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఉదా:- అరుంధతీ, వసిష్టుల దాంపత్యం. వారు అందరికీ ఆదర్శ దంపతులు.
యువకులు,యువతులు ఉన్నత చదువులు చదువుతూ, ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న నేటి నేపథ్యంలో ప్రేమ పెళ్ళిళ్ళు,కులాంతర వివాహాల సంఖ్య పెరిగింది. రెండు వైపులా పెద్దలు పలు దఫాలు మాట్లాడుకుని చేసిన వివాహాలు విడాకుల బారిన పడుతున్నాయి. చిన్న, చిన్న కారణాలతో సర్దుబాటు మనస్థత్వం ఇద్దరికి లేని కారణంగా విడాకుల సంఖ్య చాలా పెరుగుతోంది.
ఇది యే మాత్రం మంచి పరిణామం కాదు. కేవలం భౌతిక ఆకర్షణ, ఉద్రేకంతో చేసుకున్న వివాహాలు విజయవంతం కావడం కష్టం. ఆకర్షణలో కులాంతర వివాహాలు చేసుకోవడంతో కథ సుఖాంతం కాదు. పెళ్లితో కష్టాలు,సమస్యలు ప్రారంభం అయ్యాయి అని గుర్తించాలి. పరినితితో ఇద్దరి మధ్య సర్దుబాటు అవసరం.రెండు వైపులా పెద్దల ఆమోదం కూడ కట్టుకోవడం వారి గృహస్థ జీవనం మూడు పువ్వులు,ఆరు కాయలు కావడానికి అవసరం.
సంఘము, సమరసత వేదిక కులాంతర వివాహాలను సమర్ధిస్తున్నాయి. సమాజంలో సమరసత ఏర్పరచడం లో కులాంతర వివాహాలు ఒక సాధనం కాగలవని మన నమ్మకం. స్వయంసేవక కుటుంబాలలో అనేక మంది కులాంతర వివాహాలు చేసుకుని చక్కగా గృహస్థ జీవితాన్ని నిర్వహిస్తున్న వారు ఉన్నారు. ఇంతవరకు మనం ప్రచారం చేయలేదు. అలాంటి ఆదర్శ దంపతులతో ఇష్టా గోష్టి సమావేశమే ఇది.
నెల్లూరులో కొత్త ప్రయోగం… కులాంతర దంపతులతో ఇష్టాగోష్టి
ఇందులో చర్చకు వచ్చే అనేక విషయాలు నూతన దంపతులకు దిక్సూచి కాగలవు. సంఘ్ సామాజిక దృక్పథం బహిరంగ పరచే విధంగా నెల్లూరులో ఓ కొత్త ప్రయోగం జరిగింది. సమరసత వేదిక ఆధ్వర్యంలో కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులతో ఇష్టాగోష్టి సమావేశం జరిపి, వారందరికీ “అరుంధతీ వశిష్టుల చిత్రపటం” ఇవ్వడంతో బాటు, సన్మానం జరిపారు. ప్రాచీన కాలంలో వర్ణాంతర వివాహాలు, నేడు కులాంతర వివాహాలు ధర్మ సమ్మతమే అని ఈ గోష్టిలో పాల్గొన్న పూజ్య శ్రీ కమలానంద భారతి స్వామి స్పష్టం చేశారు. కుల వ్యవస్థలో ఉన్న అసమానతలను, ఇతర దోషాలను తొలగించుకోవాలని సూచించారు.
తమ తమ కుల వృత్తులు పట్ల చూపిన చిన్న చూపు వల్ల అనేక మందికి ఉపాధి లేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా మారిందని చెప్పారు.
దంపతుల అనుభవాల కథనం అనంతరం కమలానంద భారతి స్వామి ఆశీ ప్రసంగం చేస్తూ “హిందవః సోదరాహ్ సర్వే” కులాలు ఏవైనా హిందువులం అందరం సోదరులం అన్నది మన విధానం అని తెలిపారు.
కులాంతర వివాహాలు సమర్థనీయమే అని చెబుతూ కులాల హెచ్చు తగ్గులను, అస్పృశ్యతను రూపి మాపి సోదర భావం నిర్మాణం కొరకు సామాజిక సమరసతా వేదిక కృషి చేస్తోందని సమరసతా జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సన్మాన కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు శ్రీధర్, కార్యదర్శి కేశవులు, మహిళా జిల్లా కన్వీనర్ శ్రీమతి రమాదేవి, రాష్ట్ర మహిళా కన్వీనర్ శ్రీమతి కోడూరు జయప్రద, కోడూరు సత్యం నిర్వహించారు.
More Stories
ఉగ్రకుట్రకు అడ్డాగా అల్ ఫలాహ్లో 17వ నంబర్ భవనం
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రెడ్ కారిడార్: అశాంతి ముగింపుకు భారతదేశ సుదీర్ఘ యుద్ధం