
కాగా, ఆదివారం ఉదయం 7:10 గంటలకు భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా తిరిగి వినియోగించే లాంచ్ వెహికల్ (ఆర్ఎల్వి) 4.5 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరినట్లు ఇస్రో తెలిపింది. అనంతరం ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్ సిస్టమ్‌ను ఉపయోగించి దానికదే రన్‌వేపై ల్యాండ్ అయినట్లు చెప్పింది.
చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్)లో ఆదివారం ఉదయం 7:40 గంటలకు ఆటోమేటిక్ ల్యాండింగ్‌ను అది పూర్తి చేసినట్లు వెల్లడించింది. మరోవైపు మానవరహిత రీయూజబుల్ లాంచ్ వెహికల్ (ఆర్ఎల్వి) అంతరిక్షం నుంచి చాలా వేగంగా, ఖచ్చితత్వంతో వచ్చి భూమిపై ల్యాండ్ అయ్యిందని ఇస్రో తెలిపింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్), సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఎడిఇ), ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వంటి సంస్థలు ఈ పరీక్షకు సహకరించినట్లు పేర్కొంది. విజయవంతమైన ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది.
More Stories
బీహార్ లో తొలగించిన 3.66 లక్షల ఓట్ల వివరాలు వెల్లడించండి
ఎవరెస్ట్‌పై మంచు తుఫానులో చిక్కుపోయిన వెయ్యి మంది
దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కటక్‌లో కర్ఫ్యూ