
ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుజరాత్ లోని సూరత్ కోర్టు ఇటీవల రెండేళ్లు జైలు శిక్ష విధించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దేశ వ్యాప్తంగా పరువునష్టం కేసులు వెంటాడుతున్నాయి.
తాజాగా, భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఆరెస్సెస్ వారిని 21వ శతాబ్దపు కౌరవులుగా అభివర్ణించడంపై హరిద్వార్ కోర్టులో శుక్రవారం పరువు నష్టం పిటిషన్ దాఖలైంది. రాహుల్ గాంధీపై బిహార్ లోని ఒక కోర్టులోనూ మరో పరువునష్టం దావా ఇప్పటికే దాఖలైంది. ఆ కేసును బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ వేశారు.
మహారాష్ట్రలోని థానేలో కూడా రాహుల్ గాంధీపై ఒక పరువు నష్టం కేసు నడుస్తోంది. మహాత్మా గాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమని 2014 లో రాహుల్ గాంధీ ఒక బహిరంగ సభలో ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై ఆరెస్సెస్ కార్యకర్త ఒకరు థానే కోర్టులో దావా వేశారు.
మరోవైపు, సావర్కర్ ను బ్రిటిష వారిని క్షమాపణలు కోరారంటూ రాహుల్ గాంధీ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నేతలే కాకుండా, మిత్రపక్షమైన శివసేన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
More Stories
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
కీలక నేత బాలకృష్ణతో సహా 10 మంది మావోయిస్టులు మృతి!