
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్విజయం సాధించడం చారిత్రాత్మక విజయం సాధించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని, మోదీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ విజయం తెలియజేస్తోందని ఆయన చెప్పారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను, బీజేపీ కార్యకర్తలను కూడా ఆయన అభినందించారు. తెలంగాణలో ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నతరుణంలో బీజేపీ-బీఆర్ఎస్ అనేక అంశాల్లో భీకర పోరు సాగుతున్న సమయంలో ఈ విజయం బిజెపి శ్రేణులలో ఆనందోత్సవాలు కలిగిస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం రెండు పార్టీలకు ప్రతిష్టగా మారింది. ఇంతలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించడం బిజెపికి కొండంత బలాన్నిచ్చినటైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచిన ఏవీఎన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని, మోదీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ విజయంతో తెలియజేస్తోందని తెలిపారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి